జర్మనీ యువతిపై హైదరాబాద్ లో అత్యాచార ఘటన సంచలనంగా మారింది. యువతులను నమ్మించి కారులో తిప్పుతూ, చివరుకు అత్యాచారారనికి పాల్పడ్డారు ఆకతాయిలు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మనీ కి చెందిన యువతిపై హైదరాబాద్ కు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కారులో తీసుకెళ్లి నిర్మానష్య ప్రాంతంలో అత్యాచారం చేశాడు. అతని చెర నుండి తప్పించుకున్న జర్మనీ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలపై పోలీసుల ఏమంటున్నారంటే.. ఇటలీలోని మెస్సినా విశ్వవిద్యాలయంలో డేటా విశ్లేషణలో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న మంగళగిరి శరత్ చంద్ర జర్మనీలో చదువుతున్నప్పుడు అతనికి ఇద్దరు జర్మనీ కి చెందిన మిక్సీమిలియన్, కియువాన్లియుతో పరిచయం ఏర్పడింది. అయితే మార్చి 4వ తేదీన ఇండియాలోని హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు వీళ్లు వచ్చారు. బాలాపూర్ లోని శరత్ చంద్ర ఇంట్లో నివాసం ఉంటూ హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. గత నెల 31వ తేది కియువాన్లియు, మాక్సిమిలియన్ లు కలిసి సాయంత్రం 6:30 లకు కూరగాయల మార్కేట్ చూసేందుకు బయటకొచ్చారు. అయితే వారు వెళుతున్న సమయంలో ఓ స్వీఫ్ట్ కారు వచ్చింది. కారులో కొందరు యువకులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఇద్దరు జర్మనీ యువతులను పలకరించారు. మేము మీకు హైదరాబాద్ నగరం అంతా చూయించి ఇంటివద్ద దింపుతామని నమ్మించారు.

వారి మాటలను నమ్మి కారు ఎక్కడంతో చాంద్రాయణగుట్ట వైపు వెళ్ళి కారులో డీజల్ పోయించి ఎక్కడెక్కడో తిప్పి చివరకు పహాడిషరీఫ్ నుండి మామిడిపల్లి వైపు నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అందరు సెల్ఫీలు దిగుతుండగా మహమ్మద్ అబ్దుల్ అస్లాం కారును కాస్త దూరం తీసుకెళ్లి కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుండి తిరిగి వస్తుండగా మెల్లగా వస్తున్న కారులో నుండి దూకి తన స్నేహితురాలు మాక్సిమిలియన్ తో కలిసి పహాడిశెరీఫ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. జర్మనీ యువతి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని ,కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మహమ్మద్ అబ్దుల్ అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అతను నడిపిన కారును సీజ్ చేశారు . నిందితుడు 25 సంవత్సరాలు కాగా మరో ఐదుగురు 16 సంవత్సరాల లోపు వారేనని  పోలీసులు తెలిపారు. నిందితులంతా హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురా ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.