Anant Ambani Video Viral: దేశంలోని అత్యంత ధనవంతుడు, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈసారి తన పాదయాత్రతో చర్చనీయాంశమయ్యారు. తన పుట్టినరోజుకు ముందు మార్చి 28న అనంత్ అంబానీ ఈ యాత్రను జామ్‌నగర్‌లోని మోతీ ఖావడి నుంచి ప్రారంభించారు. అతను ఏప్రిల్ 30న ద్వారకా చేరుకుంటారు. ఆయన పుట్టినరోజు కూడా అదేరోజు. ద్వారకా చేరుకున్న తర్వాత అనంత్ అంబానీ భగవంత్ ద్వారకాధీశుని దర్శనం చేసుకుని తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. 

ఇప్పుడు అనంత్ అంబానీ యాత్ర సమయంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. దీనిలో అతను భారీ సంఖ్యలో కోళ్లను చూసి ఆగడం. వాటిని కొనడం అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరరల్ అవుతున్నాయి.  

పాదయాత్ర సమయంలో అనంత్ అంబానీకి కోళ్లు తీసుకెళ్తున్న ట్రక్కు కనిపించింది. అందులో దాదాపు 250 కోళ్లు తీసుకెళ్తున్నట్లు కనిపించాయి. అతను వాహనాన్ని ఆపి, డ్రైవర్‌తో మాట్లాడారు. వెంటనే వాటిని రెట్టింపు ధరకు కొనేశారు.  అనంత్ అంబానీ ఈ కోళ్లను రక్షించడానికి రెట్టింపు ధర చెల్లించారు. ఇప్పుడు ప్రజలకు ఉన్న ప్రశ్న ఏమిటంటే, అనంత్ అంబానీ కొన్న కోళ్లను ఏం చేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాటిని వనతారాకు తీసుకెళ్తారా అని ఆశ్చర్యపోతున్నారు.  

వనతారా అంటే ఏమిటి?అనంత్ అంబానీ గత సంవత్సరం తన వనతారా ప్రాజెక్టుతో కూడా చర్చనీయాంశమయ్యారు. వనతారా అనంత్ అంబానీ ప్రారంభించిన ఒక ప్రాజెక్టు, ఇందులో నిరాశ్రయులైన జంతువులకు ఆశ్రయం ఇస్తున్నారు. గాయపడిన జంతువులకు చికిత్స  చేస్తున్నారు. ఇక్కడ జంతువుల సంరక్షణ కోసం వైద్యులు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. వనతారాలో దాదాపు అన్ని జాతుల జంతువులు ఉన్నాయి, వాటికి ఆహారం కూడా ఇక్కడే తయారు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వనతారాకు వెళ్ళారు. అప్పట్లో ఆ చిత్రాలు బాగా వైరల్ అయ్యాయి. 

కోళ్లను కూడా వనతారాకు పంపిస్తారా?ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వనతారాలో కోళ్ల పెంపకం కూడా జరుగుతుందా అని. అనంత్ అంబానీ కొన్న కోళ్లను కూడా వనతారాకు పంపిస్తారా? అని డౌట్ అందరిలో ఉంది. ట్రక్‌లో కోళ్లను వధించేందుకు తీసుకెళ్తున్నట్టు తెలుసుకున్న అనంత అంబానీ వాటిని రెట్టింపు ధర ఇచ్ిచ కొనేశారు. రక్షించిన కోళ్లను వెంటనే విడిచిపెట్టారని తెలిసింది. వనతారాలో కోళ్ల పెంపకం ఉందా లేదా అనేది ప్రజలకు తెలియదు. అనంత్ అంబానీ తన జంతు ప్రేమకు పేరుగాంచారు. వీడియోలో అతను ఒక కోడిని చేతుల్లో పట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు కనిపించారు.