Anantapur Porn Gang Arrest: ఆంధ్రప్రదేశ్ లో ఈజీ మనీ కోసం పోర్న్ సైట్లకు వీడియోలు అమ్ముకునే ముఠాలు కూడా తయారయ్యాయి.  XHAMSTER.COM & XHAMLIVE.COM  వంటి వెబ్ సైట్లకు ఇక్కడి నుంచి వీడియోలు అమ్ముతున్నారు.  ఈ వెబ్ సైట్స్ లో అశ్లీల వీడియోలు పెట్టడం వలన క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు వస్తున్నాయి. ఈ ముఠాను పోలీసులు చేధించారు.             

తెలుగు రాష్ట్రాల అమ్మాయిలను.. ముఖ్యంగా డబ్బు అవసరం ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి వ్య‌భిచార కూపంలోకి దింపుతున్నారు. వారితోనే వీడియోలు తీసి  వెబ్సైట్ లో పెట్టీ డబ్బు సంపాదిస్తున్నారు. ఏడాదిన్నరగా వీరు అనేక వీడియోలు తీసి పాతిక లక్షలకుపైగా సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి  సంబంధిత పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.  మైనర్ బాలికను కూడా ఈ ఊబిలోకి దింపే అవకాశం ఉన్నందు వలన చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా ప్రకటించారు.  నేషనల్ ఏజెన్సీల తో కూడా సంప్రదించి తగు చర్యలు తీసుకుంటాంమని.. ప్రకటించారు.                  

గుంతకల్‌లో  కాల్ సెంటర్ నిర్వహిస్తున్న లూయిస్ అనే వ్యక్తి  కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు. వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు. వీడియోలను విక్రయించి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు సంపాదిస్తున్నారు.  ఇతనికి శ్రీకాకుళం జిల్లా పాత పట్నంకు చెందిన గణేష్, జోత్న్సలు సహకరిస్తున్నారు.  . సిబ్బందితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరణ  చేసి అమ్ముతున్నట్లుగా గుర్తించి అరెస్ట్  చేశారు.  పోర్న్ వీడియోలు రూపొందించడమే కాకుండా లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందు కోసం గుంతకల్‌లో ఏకంగా స్టూడియో సెట్ అప్ వేశారు.                    

సైప్రస్ దేశానికి చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారని తెలిపారు. యువతి, యువకులు అప్రమత్తంగా ఉండాలని ఐజి రవిక్రిష్ణ హెచ్చరించారు. ఇలాంటి నేరాలు ప్ర‌జ‌ల దృష్టికి వ‌స్తే సైబర్ క్రైమ్ ద్వారా 1930 కి కంప్లైంట్ ఇవ్వవచ్చునని ఈగల్  విభాగం చీఫ్ ఆకే రవికృష్ణ ప్రకటించారు.                

ఇటీవలి కాలంలో ఇలాంటి నేరాలు పెరుగుతున్న సూచనలు  కనిపిస్తున్నాయి. గత నెలలో ఢిల్లీలోని ఓ సాఫ్ట్ వేర్ జంటను కూడా పోలీసులు ఇదే కారణంతో అరెస్టు చేశారు. వారు ఏకంగా తమ ఇంట్లో పెద్ద అత్యాధునిక స్టూడియోను ఏర్పాటు చేశారు. మోడల్స్ ను ఆకర్షించి..  పోర్న్ వీడియోలను సిద్ధం  చేసేవారు. లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చేవారు. ఇలా వారు పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించినట్లుగా గుర్తించారు. వారు కూడా ఈ ఫేమ్ వెబ్ సైట్లకే అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఈజీ మనీ కోసం నేరగాళ్లు..  అమ్మాయిల్ని ఆకర్షించి ఇలాంటి పనులు చేస్తూండటంతో..  ఈ ముఠాలు ఎన్ని ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.