Road Accident in East Godavari District: రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మహిళలు సహా నలుగురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని స్థానికుల సహయాంలో ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.