Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌కు నిజం తెలిసే లోపు నువ్వు ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్‌ అవ్వు అంటూ మనోహరి రణవీర్‌కు చెప్తుంది. అలా ఏం జరగదని కిడ్నాప్‌ చేసేందుకు కిరాయి రౌడీలను తీసుకొచ్చానని రణవీర్‌ చెప్తాడు. చిత్ర పిల్లలతో ఎంజాయ్‌ చేస్తుంటే.. మనోహరి కోపంగా  చూస్తుంది.

రణవీర్‌:  అదేంటి మనోహరి పిల్లలు భాగీ పక్కన ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయాలని చెప్పావు. ఇప్పుడు పిల్లలు చిత్రతో వెళ్తుంటే సైలెంట్‌గా ఉన్నావు

మనోహరి:  దాని స్థాయికి మించి కలలు కంటుంది అది. ఇప్పుడు దాన్ని కిందకు దించడం చాలా ముఖ్యం పిల్లలు దాని దగ్గర ఉన్నప్పుడే అంజును కిడ్నాప్‌ చేయ్‌. ఇప్పుడు అమర్‌ దగ్గరకు వెళ్లి బయటకు వెళ్తున్నట్టుగా ఫోన్‌ వచ్చిందని చెప్పి మరీ వెళ్లు

రణవీర్‌:  సరే మనోహరి.. (అమర్‌ దగ్గరకు వెళ్తాడు) అమరేంద్ర గారు.. ఒక చిన్న కాల్ మాట్లాడుకోవాలి ఇప్పుడే వస్తాను

అని బయటకు వెళ్లినట్టు వెళ్తూ.. లోపలే ఉన్న తన మనుషుల దగ్గరకు వెళ్తాడు రణవీర్‌. అంజును చూపిస్తూ ఆ చిన్న పాపనే కిడ్నాప్ చేయాలి అని చెప్తాడు. మరోవైపు అమర్‌ దగ్గరకు మనోహరి వెళ్తుంది. అప్పుడే అక్కడికి అనామిక, బాగీ వస్తారు.

భాగీ: ఏవండి పిల్లలు ఇంకా చిత్ర దగ్గరే ఉన్నారా..?

అమర్‌:  అవును భాగీ ఎందుకు..?

అనామిక:  చిత్ర ఒక్కతే పిల్లలను చూసుకోలేదు నేను వెళ్తాను. మనోహరి గారు మీరు రండి

రాథోడ్‌: మిస్సమ్మ ఎంజాయ్  బై..

భాగీ: ఏవండి నాకు ఐస్‌ క్రీమ్ తినాలనిపిస్తుంది

అమర్‌:  నో అనే ఆప్షన్‌ లేదు కదా వెళ్దాం పద

ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్తారు.

మనోహరి:  ఏయ్‌ ఆగు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు.. వదలు

అనామిక: ఏం లేదు మనోహరి గారు అక్కడ ఫుడ్‌ బాగుంటుందట రండి తిందాం.

మనోహరి: చీచీ ఫుడ్‌ తినటం ఏంటి..?

అనామిక: మాతో కలిసి ఫుడ్‌ తినడం ఇష్టం లేదా..?

మనోహరి: నాకు ఎవ్వరితో కలిసి తినడం ఇష్టం ఉండదు

రాథోడ్‌:  పదండి మేడం మనం వెల్లి అక్కడ పప్స్‌ బాగుంటాయట తిందాం

అనుకుంటూ ఇద్దరూ వెళ్లిపోతారు.

మనోహరి: వాళ్లిద్దరిని కలపడానికి నన్ను ఇక్కడకు లాక్కోచ్చింది ఇది చెప్తా దీని పని

అని కోపంగా చూస్తుంది. అమర్‌, భాగీ ఐస్ క్రీం తింటుంటారు.

అమర్: భాగీ చిత్ర మీద నీ అభిప్రాయం ఏంటి..?

భాగీ: స్పెషల్‌గా ఏమీ లేదండి ఎందుకు అడుగుతున్నారు

అమర్‌: ఏం లేదు.. వినోద్‌ ను చూస్తుంటే.. ఎందుకో చిత్రను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది.

భాగీ: చిత్ర మంచిదే అయ్యుండొచ్చు అండి కానీ ఎందుకో మాట తీరు చూస్తుంటేనే కొంచెం తేడాగా అనిపిస్తుంది

అమర్‌: అయితే సరేలే ఏదైనా ఉంటే వినోద్‌ చెప్తాడు కదా

ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటుంటే దూరం ఒకావిడ భాగీ వైపు చూస్తూ ఏవే సైగలు చేస్తుంది. ఆవిడను చూసిన భాగీ షాక్‌ అవుతుంది. ఈవిడను ఎక్కడో చూసినట్టు ఉందని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే కొద్ది రోజుల క్రితం ఆరు ఫోటో చూపించమంటే మనోహరి చూపించిన ఫోటోలో ఉన్నావిడే ఈవిడ. వెంటనే భాగీ షాకింగ్‌గా ఆవిడ వైపు లేచి కంగారుగా వెళ్తుంది. అమర్‌ పిలిచినా పట్టించుకోకుండా వెళ్తుంది. వెనక వచ్చిన అమర్‌ ఏమైందని అడగ్గా.. నేను ఆరు ఆక్కను చూశాను అని చెప్తుంది. దీంతో అమర్ కోపంగా నీ మాటలు పిల్లలు వింటే భయపడతారు భాగీ అంటూ తిడతాడు. అయినా వినకుండా ఆరు ఆమె వైపు పరుగెడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!