Andhra Pradesh News: చిరుతను వేటాడి చంపి.. దాన్ని చర్మాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీసులు. నిఘా పెట్టి నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ముఠాను  ఎలా పట్టుకున్నారంటే... చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ (DRI) అధికారులు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో విశాఖలో నిఘా పెట్టారు. ఆర్కే బీచ్ దగ్గర పాండురంగపురం సమీపంలోని ఓ హోటల్‌ దగ్గర  ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటం గుర్తించారు. ఆ ముగ్గురినీ తనిఖీ చేశారు. వారి వద్ద చిరుతపలి చర్మం ఉండటంతో... వారిని అదుపులోకి తీసుకున్నారు. 


 పులుల చర్మాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 
చిరుతపులులను వేటాడి దాన్ని చర్మాన్ని విక్రయించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పక్కా ప్లాన్‌ ప్రకారం తనిఖీలు  నిర్వహించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా... విశాఖ మీదుగా చిరుత చర్మాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అంతేకాదు... పట్టుబడిన ముగ్గురుతో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని  పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ముఠాలోని కీలక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చిరుత చర్మం తరలించేందుకు వారు ఉపయోగించిన కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.


మేజిస్ట్రేట్‌ ఎదుట నిందితుల హాజరు


వన్యప్రాణి  చట్టం-1972లోని నిబంధనల ప్రకారం... తదుపరి విచారణ కోసం నలుగురు నిందితులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించారు. చిరుత చర్మాన్ని కూడా అటవీ శాఖ అధికారులకే అప్పగించారు. నిందితులను స్థానిక మేజిస్ట్రేట్‌  కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్‌ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి చిరుతపులి చర్మంతో విశాఖపట్నానికి వచ్చినట్టు గుర్తించారు. వారి ద్వారా... చర్మాని కొనుగోలు చేసే వారి సమచారాం కూడా తెలుసుకున్నారు పోలీసులు.  ఆరా  తీశారు. వారిని డీఆర్‌డీఏ ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు నిందితుల విచారణలో కనుగొనబడింది. ఒడిశాలో మూడు, నాలుగు నెలల క్రితం చిరుతను వేటాడినట్టు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న చర్మం కొలతలను పరిశీలిస్తే.. అది పెద్ద  చిరుతపులిదని గుర్తించారు. 


వన్యప్రాణి రక్షణ చట్టం-1972లోని షెడ్యూల్-1 ప్రకారం చిరుతపులిని వేటాడటం నేరం. జంతువును, దాని శరీరంలోని ఏదైనా భాగాన్ని తీసుకోవడం చట్ట ప్రకారం శిక్షార్హమైనది. జంతు చర్మాలను, శరీర భాగాలను స్మగ్లింగ్‌ చేస్తే... ఏడు సంవత్సరాల జైలు  శిక్ష పడుతుంది. ఈ కేసులో... అటవీశాఖ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. చిరుత చర్మం స్మగ్లింగ్‌ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది... అని కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు... ఇప్పుడు పట్టుబడ్డ నిందితులు.. గతంలో  కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అని దర్యాప్తు జరుపుతున్నారు. చిరుతపులను వేటాడి... వాటి చర్మాన్ని అమ్ముకోవడమే ఈ ముఠా పని అయితే.. ఎప్పటి నుంచి చేస్తున్నారు...? ఎంకా ఎంత మంది ఇన్వాల్వ్‌ అయి ఉన్నారు అని  కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.