ఖమ్మం: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధర్మల్ పవర్ స్టేషన్లోని ఒకటో యూనిట్‌లో శనివారం (జూన్ 29న) రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు
Shankar Dukanam | 29 Jun 2024 10:25 PM (IST)
Fire Accident: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు