సికింద్రాబాద్  మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగతో మొత్తం ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మరో 13 మంది గాయపడినట్లు సమాచారం. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.


ఆ షోరూమ్‌లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పైనే రూబీ లాడ్జి ఉండడంతో పొగంతా వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక  సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షోరూం పైన లాడ్జి ఉండడంతో అందులో పెద్ద సంఖ్యలో పర్యటకులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు.


సహాయకార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్న మంత్రి తలసాని 


లాడ్జిలో ఉన్న వారిలో ఐదుగురు కిందకు దూకి గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, లాడ్జిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.   






ఎనిమిది మంది మృతి


సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి కింద ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. బైక్ షోరూమ్ లో ఏర్పడిన మంటలు పైన ఉన్న రూబీ లాడ్జిపైకి ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి లాడ్జిలో ఉన్నవారు చనిపోయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని, ఈ  ప్రమాదానికి ఇంకా తెలియరాలేదన్నారు. పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోదని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. రూబీ హోటల్ లో మొత్తం నాలుగు ఫోర్లలో 23 రూమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి రెండు ఫోర్లలోని వారు చనిపోయారని సీపీ తెలిపారు. ఆరుగురి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని యశోధ ఆసుపత్రికి తరలించారు. మంటలు వ్యాపించినట్లు హోటల్ పై నుంచి దూకిన వారెవరూ చనిపోలేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 



రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘‘బిల్డింగ్ సెల్లర్ ని మిస్ యూస్ చేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయి. 8 మంది స్మోక్ ద్వారానే చనిపోయారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాం. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తాం. బైక్ షోరూం నిర్వహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని అన్నారు.