Fake police station busted in Bihar : అది బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని మొహాని అనే గ్రామ పంచాయతీ. అక్కడ స్కూల్ బిల్డింగ్ లో ఓ రోజు పోలీస్ స్టేషన్ ప్రారంభమయింది. రాహుల్ అనే వ్యక్తి తనకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని..తానే మొత్తం చూసుకుంటానని సెటప్ వేయించుకున్నారు. స్కూల్ పేరును పోలీస్ స్టేషన్ గా మార్చేశారు. అందరూ నిజమేనని నమ్మేశారు. 

తానే పోలీస్ ఉద్యోగాలిస్తానని చెప్పి.. ఆ ఊరి వారికే ఉద్యోగాలిచ్చాడు. ఫేక్ పోలీస్ స్టేషన్ పెట్టిన రాహుల్ , యువకులకు "హోమ్‌గార్డ్" లేదా "గ్రామ రక్షక్ దళ్"లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాడు.  ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి, ఒక్కొక్కరి నుండి లక్షల రూపాయలు వసూలు చేశారు.  నెలకు 22,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి, వారిని నకిలీ పోలీస్ స్టేషన్‌లో పనిచేయించారు. డబ్బులు తీసుకుని .. యూనిఫామ్‌లు, ఐడీ కార్డులు ఇచ్చాడు.  ఈ స్టేషన్‌లో నకిలీ పోలీసులు ఖాకీ యూనిఫామ్‌లు ధరించి, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులతో పనిచేశారు.  వారు వాహన తనిఖీలు,   శాంతిభద్రతల పేరిట ఆల్కహాల్ స్వాధీనం వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ప్రతీ చోటా వీరు కేసులు నమోదు చేయడం ఏమీ ఉండదు. కేవలం డబ్బులు వసూలు చేయడమే.  సుమారు 300 మంది వ్యక్తులు ఈ మోసంలో బాధితులయ్యారు. దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఈ పోలీస్ స్టేషన్ డిచింది. స్థానిక ప్రజలు  కొంత మందికి   ఈ స్టేషన్ కార్యకలాపాలపై అనుమానం కలిగింది. ఎనిమిది నెలల పాటు ఈ స్టేషన్ నడవడం, స్థానిక ఎస్పీ, ఎమ్మెల్యే వంటి అధికారులకు తెలియకపోవడంతో పై స్తాయి వారికి సమాచారం ఇచ్చారు.  బిహార్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఈ నకిలీ స్టేషన్‌ను బయటపెట్టారు. నిందితులను అరెస్టు చేసి, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.  ]

 నకిలీ పోలీస్ స్టేషన్ ద్వారా మోసపోయిన బాధితులు, స్థానిక ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద స్థాయిలో మోసం జరిగినా అధికారులకు తెలియకపోవడం ఏమిటని వారంటున్నారు.   ముఖ్య నిందితుడు రాహుల్‌తో పాటు ఇతర నిందితులను అరెస్టు చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇలా ఎలా మోసం చేశాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు.