Ex Facebook manager Stole:
సొంత కంపెనీకే కన్నం..
ఫేస్‌బుక్ మాజీ మేనేజర్ బర్బరా ఫుర్లో స్మైల్స్ (Barbara Furlow-Smiles) కంపెనీ ఖజానా నుంచి దాదాపు రూ.32 కోట్లు కొల్లగొట్టింది. ఫేక్ వెండార్స్‌ని సృష్టించి ఈ మొత్తం కాజేసింది. 2017-21 మధ్య కాలంలో పెద్ద మొత్తంలో ఫండ్స్‌ని సేకరించిన స్మైల్స్...ఆ డబ్బుతో జల్సాలు చేసింది. కాలిఫోర్నియా, జార్జియాలో విలాసవంతమైన జీవితం గడిపింది. లగ్జరీ లైఫ్‌ని గడిపేందుకే ఈ పెద్ద మొత్తం డబ్బుని దొంగిలించినట్టు విచారణలో వెల్లడైంది. కంపెనీ అకౌంట్ సిస్టమ్‌ని మానిప్యులేట్ చేసి...తన కార్పొరేట్ క్రెడిట్ కార్డ్‌లతో లింక్ చేసింది. పేమెంట్ సర్వీసెస్‌తో ఈ అకౌంట్‌ని లింక్ చేసి అన్ని చోట్లా పేమెంట్‌లు చేసింది. అసలు ఫేస్‌బుక్ ట్రాన్‌జాక్షన్స్‌తో సంబంధం లేకుండా ఈ డబ్బులు ఖర్చు చేసింది. విచారణలో ఇదంతా బయట పడింది. స్నేహితులు, బంధువుల అకౌంట్‌లలోకి ఈ డబ్బులు పంపింది. వాళ్లు తిరిగి వాటిని నగదు రూపంలో ఆమెకి ఇచ్చేవాళ్లు. కొంత మంది ఆ క్యాష్‌ని కొన్ని వస్తువుల్లో దాచి పంపేవాళ్లు. మరి కొందరు టీషర్ట్స్‌లో క్యాష్ దాచి పంపించే వాళ్లు. ఇలా ఈ తంతు చాలా రోజుల పాటు కొనసాగింది. అనుమానం వచ్చి విచారణకు ఆదేశించింది సంస్థ. అప్పుడు కానీ ఈ వ్యవహారం అంతా బయటపడలేదు. మొత్తానికి ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. ఉద్దేశపూర్వకంగా కంపెనీని మోసం చేయడాన్ని కోర్టు తీవ్ర నేరంగా పరిగణించింది. ఇలా కొల్లగొట్టిన డబ్బుల్ని ఆమె వ్యక్తిగత ఖర్చుల కోసం వెచ్చించింది. హెయిర్ స్టైలిస్ట్‌లు, బేబీ సిట్టర్స్‌కి పెద్ద మొత్తంలో చెల్లించింది. ఈ కేసులో ఆమెని దోషిగా తేల్చిన కోర్టు వచ్చే ఏడాది మార్చి 19 వరకూ జైలుశిక్ష విధించింది.