Just In





Crime News : రంగారెడ్డి జిల్లాలో దారుణం - ఇంజినీరింగ్ స్టూడెంట్ పై డ్రైవర్ అఘాయిత్యం
Crime News : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Crime News : దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలకు అడ్డే లేకుండా పోయింది. మహిళలు ఒంటరిగా ఎక్కడ కనిపించినా కామాంధులు కాటేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ స్టూడెంట్ పై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందిన సమాచారం ప్రకారం, 18ఏళ్ల విద్యార్థిని మంగళ పల్లి గేటు వద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ.. ఇబ్రహీంపట్నంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ తరుణంలోనే జనవరి 16, 2025 తెల్లవారుజామున విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యం చేశాడు. అనంతరం ఆ యువతి పోలీసులను ఆశ్రయించి, ఘటనపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దళిత బాలికపై అఘాయిత్యం
ఇటీవలే కేరళలోని పతనం తిట్టలో ఒక దళిత బాలికను దాదాపు 60 మంది పైగా దుండగులు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. నిందితులంతా సమీప బంధువులు, తండ్రి స్నేహితులు, ఆమె సహచరులే కావడంతో ఆమె మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇలాంటి నిస్సాయక మహిళల కోసం స్వయం సహాయక సంఘాల వేదిక (కుడుంబశ్రీ) నిర్వహించే ‘స్నేహిత’ కౌన్సిలింగ్ ద్వారా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం డీఐజీ నేతృత్వంలో 25 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ బాలిక ‘స్నేహిత’ కౌన్సిలింగ్‌లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెల్లడించింది. 13ఏళ్ల వయసు నుంచి తాను ఈ వేధింపులు ఎదుర్కొంటున్నానని, 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బైక్‌పై తీసుకెళ్లి ఇంటికి సమీపంలోని అచ్చంకోటుమల సమీపంలోని రబ్బరు తోటలో మొదట సహవిద్యార్థి సుబిన్, అతని మిత్రులు అత్యాచారం చేశారని తెలిపింది. ఈ దారుణం గురించి తెలిసిన ఆమె తండ్రి స్నేహితులు కూడా బాలికను బెదిరింపులకు గురి చేసి పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడడం మరింత ఆందోళన కలిగించే విషయం.
హైకోర్టు కీలక తీర్పు
మహిళలను అనుచిత వ్యాఖ్యలతోనే కాదు వారి శరీరాకృతిపై కామెంట్స్ చేసినా లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ కేరళ హైకోర్టు ఇటీవలే తేల్చి చెప్పింది. ఇది వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని, ముఖ్యంగా మహిళల శరీరాకృతి, రంగుపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని సూచించింది.
Also Read : Kerala Athlete: కేరళలో అథ్లెట్‌పై లైంగిక వేధింపుల కేసు - 44 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు