Electrical Contractor Brutally Murdered In Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లాలో (Satyasai District) బుధవారం రాత్రి దారుణం జరిగింది. ఓ విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తచెరువు మండలం మైలేపల్లి వద్ద కాంట్రాక్టర్ రాజశేఖర్ తలపై దుండగులు ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. ఫాంహౌస్‌లో రాజశేఖర్‌తో పాటు ఇద్దరు సహాయకులు నిద్రించారు. దుండగులకు రాజశేఖర్ చిక్కగా సహాయకులు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దుండగులు రాజశేఖర్‌ను దూరంగా తీసుకెళ్లి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఫాంహౌస్ వద్ద పడేసి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో (Srikakulam IIIT) ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం అర్ధరాత్రి హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో తోటి విద్యార్థులు, సిబ్బంది గమనించి శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్ నాయక్ మృతి చెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాగా.. ఎస్ఎం పురం క్యాంపస్‌లో సివిల్ ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.