Doctor wife commits suicide in Warangal: సోషల్ మీడియా చాలా డేంజర్. ఎంత పద్దతిగా ఉపయోగించుకుంటే లైఫ్ అంత పద్దతిగా ఉంటుంది. బానిసలా మారితే.. లైఫ్ అంతా గజిబిజి అయిపోతుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. డాక్టర్లకు కూడా. ఎందుకంటే.. వరంగల్ లో ఓ యువ డాక్టర్ సోషల్ మీడియా మోజులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాడు. ఇప్పుడు అటు కుటుంబం చిన్నా భిన్నమైంది...ఇటు జైలుకు పోయే పరిస్థితికి వచ్చింది.
వరంగల్‌లో ప్రత్యూష అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. మంచి కుటుంబం, ఆర్థిక సమస్యలు లేవు.. అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో అని అందరూ షాక్ కు గురయ్యారు. కానీ అసలు కారణం సోషల్ మీడియా అని తేలింది.
ప్రత్యూష భర్త సృజన్ కూడా వైద్యుడే. మంచి ప్రతిభావంతమైన యువ వైద్యుడిగా గుర్తింపు పొందారు. కార్డియాలజీ రంగంలో ఎంతో భవిష్యత్ ఉందని అనుకున్నారు. 2017లో ప్త్రత్యూషతో సృజన్ పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు సంవత్సరం ఏడు నెలల పాప కాగా మరొకరు 7 నెలల పాప. ఇద్దరు పిల్లలతో వీరి కుటుంబం .. బంగారు కుటుంబంగా ఉంటుందని అనుకున్నారు. కానీ సృజన్ సోషల్ మీడియాలో. రీల్స్ చేసే ఓ మహిళ పట్ల ఆకర్షితుడయ్యాడు.
బుట్టబొమ్మ పేరుతో ఇన్ స్టాలో రీల్స్ చేసే శృతి అనే అమ్మాయితో.. సృజన్ పరిచయం పెంచుకుంది. రాను రాను వారి మధ్య బంధం హద్దులు దాటిపోయింది. కుటుంబ సభ్యులు బాధపడతారని కానీ.. కుటుంబం నాశనమైపోతుందని కానీ అనుకోలేదు. సృజన్ మారకపోగా.. ఆ రీల్స్ చేసే శృతితో కలిసి భార్య ప్రత్యూషను అవమానించడం ప్రారంభించారు. చివరికి శృతి కూడా.. సృజన్ భార్యను బెదిరించినట్లుగా ఆరోపణలుఉన్నాయి. వివాహేతర బంధ ప్రేమలో మునిగిపోయిన యువ డాక్టర్ సృజన్ వేధింపులు ఎక్కువ కావడంతో భార్య డాక్టర్ ప్రత్యూష తట్టుకోలేకపోయారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే చనిపోయినటు వైద్యులు నిర్ధారించారు. అయితే సృజన్ ప్రేమ వ్యవహారానికి భార్య అడ్డు ఉండడంతో తొలగించాలని చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు..
సృజన్ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న రీల్స్ అమ్మాయి బానోతు శృతి సైతం తన కుమార్తెను బెదిరించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్య మృతిలో నిందితుడు గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సృజన్ ను హాసన్ పర్తి పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రీల్స్ చేసే మహిళపై మోజులో పడి.. తన ఇద్దరు పిల్లలకు తల్లిని కోల్పోయాడు సృజన్. కుటుంబం చిన్నాభిన్నమైందని గుర్తించేసరికి .. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.