Crime News: నలుగుర్ని మర్డర్ చేసి పాతికేళ్లు దొరికాడు -ఈ మధ్యలో ఎన్ని ట్విస్టులో - ఈ హంతకుడు యమ డేంజర్
Murders: నాలుగు హత్యలు చేసి పాతికేళ్ల తర్వాత దొరికాడో హంతకుడు. పట్టుకోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది.
Delhi Murderer caught after 25 years: 1999-2001 మధ్య ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ, అల్మోరా, చంపావత్ జిల్లాల్లో నలుగురు క్యాబ్ డ్రైవర్లు హత్యకు గురయ్యారు. కార్లు బుక్ చేసుకుని ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి డ్రైవర్లను ఘోరంగా చంపేసి కార్లు ఎత్తుకెళ్లిపోయారు. ఆ మర్డర్లు ఎవరు చేశారో.. తెలియక పోలీసులు కేసును అలా ఉంచేశారు. అయితే ఇటీవల ఓ కేసులో అజయ్ లంబా, అలియాస్ బంసీ అనే నేరస్తుడ్ని అరెస్టు చేశారు. ఇతర కేసుల్లో విషయాలు వెలికి తీస్తూంటే పాతహత్యల గురించి క్లూ లభించింది. మొత్తం బయటకు లాగిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
అజయ్ లంబా తన స్నేహితులు ధీరేంద్ర, దిలీప్ నేగీతో కలిసి టాక్సీలను అద్దెకు తీసుకుని, డ్రైవర్లను ఉత్తరాఖండ్‌లోని రిమోట్ హిల్లీ ప్రాంతాలకు తీసుకెళ్లి, మత్తు మందు ఇచ్చి లేదా గొంతు పిసికి చంపేవారు. వాలను గుర్తించకుండా ఉండేందుకు అడవుల్లో లేదా లోతైన లోయల్లో పడేసి, వాహనాలను నేపాల్ సరిహద్దు దాటించి అమ్మేవారు. చిన్న తనం నుంచి నేరాలకు అలవాటు పడిన అజయ్ లాంబా.. బరేలీలో దోపిడీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నడాు. అక్కడ పోలీసులు అతనిపై షీట్ ఓపెన్ చేశారు. హత్యలు చేసిన తర్వాత నేపాల్ పారిపోయి..పదేళ్లు అక్కడే ఉన్నాడు. మళ్లీ ఇండియాకు వచ్చి.. తన పేరు, గుర్తింపు అన్నీ మార్చేసుకున్నాడు. కానీ నేరాలను మాత్రం వదల్లేదు.
ఒడిశా నుండి ఢిల్లీ మరియు ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. 2021లో సాగర్‌పూర్ పోలీసులు అతన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద అరెస్టు చేశారు. 2024లో ఒడిశాలోని బెహ్రాంపూర్‌లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో మరోసారి అరెస్టయ్యాడు. ఈ రెండు కేసుల్లోనూ అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.అతని రికార్డులు చూసిన తర్వాత పోలీసులు క్యాబ్ డ్రైవర్ల హంతకుడు కూడా అని గుర్తించి నిఘా పెట్టారు. అజయ్ లంబాను ట్రాక్ చేసి, ఇండియా గేట్ వద్ద అరెస్టు చేసింది.
అజయ్ లంబా గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులు గతంలో అరెస్టయ్యారు. పోలీసులు అజయ్ లంబా , అతని సహచరుడు ధీరజ్‌ను కలిసి విచారించాలని ప్లాన్ చేస్తున్నారు, దీని ద్వారా గ్యాంగ్ ఇతర నేరాలు మరియు బాధితుల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నాలుగు హత్యల్లో ఒక టాక్సీ డ్రైవర్ శవం మాత్రమే ఇప్పటి వరకూ బయటపడింది.