Delhi Hit-And-Run Case:
కార్ రూఫ్‌పైనే..
ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ (Hit And Run) కేసు వెలుగులోకి వచ్చింది. వీఐపీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం సంచలనమవుతోంది. కస్తుర్బా మార్గ్‌లో
ఓ కార్ టూవీలర్‌ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బైక్‌పై ఇద్దరు ఉన్నారు. ఓ వ్యక్తి ఎగిరి కొంత దూరంలో పడిపోగా మరో వ్యక్తి మాత్రం కార్ రూఫ్‌పై పడిపోయాడు. ఇది తెలిసి కూడా ఆ కార్ డ్రైవర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇది చూసి గట్టిగా అరిచాడు. కార్ ఆపమని ఎంత చెప్పినా వినకుండా స్పీడ్ పెంచి మరీ వెళ్లిపోయాడు ఆ కార్ డ్రైవర్. దాదాపు మూడు కిలోమీటర్ల వరకూ ఎక్కడా ఆపలేదు. ఢిల్లీ గేట్ వద్ద కార్ రూఫ్‌పై ఉన్న వ్యక్తిని కింద పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో 30 ఏళ్ల దీపాన్షు వర్మ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కజిన్ ముకుల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు...వెంటనే నిందితుల కోసం గాలించారు. అనుమానితులను అరెస్ట్ చేశారు. మృతుడు దీపాన్షు వర్మ ఓ జ్యువెలరీ షాప్‌ని నడుపుతున్నాడు. మహమ్మద్ బిలాల్ అనే వ్యక్తి ఈ ఇన్సిడెంట్‌ని వీడియో తీసి పోలీసులకు అందించాడు. ఆ వీడియో ఆధారంగా పలువురుని అదుపులోకి తీసుకున్నారు. అయితే...ఈ కేసుకి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు.
గతంలోనూ..
ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసులు కొత్తేం కాదు. కంజావాలాలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత నోయిడాలో ఓ కార్ టూవీలర్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న స్విగ్గీ ఏజెంట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఢీకొట్టిన తరవాత దాదాపు 500 మీటర్ల వరకూ కార్..బైక్‌ని లాక్కెళ్లిందని పోలీసులు వెల్లడించారు. "స్విగ్గీ ఏజెంట్ కౌశల్...ఫుడ్ డెలివరీ కోసం బయటకు వచ్చాడు. నోయిడా సెక్టార్ 14 వద్ద ఓ కార్ వేగంగా వచ్చి ఢీకొట్టింది" అని వివరించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం...బైక్..కార్‌కు చిక్కుకుంది. కొంత దూరం వరకూ కార్ డ్రైవర్ అలానే ముందుకు వెళ్లాడు. కార్‌లో బాధితుడు చిక్కుకున్నాడు. కాసేపయ్యాక ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అప్పుడు కానీ డ్రైవర్ కార్ ఆపలేదు. అప్పటికే కౌశల్ మృతి చెందాడు. మృతుని వయసు 24 ఏళ్లు అని పోలీసులు నిర్ధరించారు. అర్ధరాత్రి 1 గంటకు కౌశల్‌కు తన సోదరుడు కాల్ చేశాడు. అప్పటికే కౌశల్ ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ స్పాట్‌లో ఉన్న ఓ వ్యక్తి కాల్ అటెండ్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. "యాక్సిడెంట్ స్పాట్ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితుడిని పట్టుకుంటాం" అని పోలీసులు వెల్లడించారు.
Also Read: karnataka elections 2023: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ నిరసన, మేనిఫెస్టో కాపీలు దగ్ధం