Fake Note Alleging Misappropriation Of Government Funds: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఇటీవలే 'TS'కు బదులుగా 'TG'గా మార్చిన విషయం తెలిసిందే. ఇలా మార్చడం వల్ల భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ కొందరు ఓ ఫేక్ నోట్‌ను (Fake Note) ప్రచారం చేశారు. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్ నేరగాళ్లు ఓ నకిలీ నోట్ రూపొందించి ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈ నోట్ సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మొద్దని.. అలాంటివి ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 


Also Read: Siricilla News: భార్యపై కోపంతో ఇంటినే తగులబెట్టాడు - సిరిసిల్ల జిల్లాలో ఘటన