Madhya Pradesh engineer caught with 17 tonnes honey: అధికారులు లంచాలకు అలవాటు పడి కోట్లు వెనకేసుకుంటారు. ఈ అధికారి కోట్లతో పాటు తేనెను కూడా వెనకేసుకుంటున్నారు. కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. 

Continues below advertisement

మధ్యప్రదేశ్ లోకాయుక్త అధికారులు రిటైర్డ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) చీఫ్ ఇంజనీర్ GP మెహ్రా ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు చేశారు.  ఈ దాడులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి.  మొత్తం రూ.36.04 లక్షల నగదు, 2.649 కేజీల బంగారు, 5.523 కేజీల వెండి, అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు, షేర్ల డాక్యుమెంట్లు,  అనేక ఆస్తి పత్రాలు, 39 కాటేజీలు , నాలుగు లగ్జరీ కార్లు వంటి ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంోలమెహ్రా ఫామ్‌హౌస్‌లో  17 టన్నుల తేనే దొరికింది.   లోకాయుక్తా అధికారులు మెహ్రా ఇంటి, ఫామ్‌హౌస్, వ్యాపార స్థాపనలపై నలుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)ల నేతృత్వంలో దాడులు చేశారు. నగదు  లెక్కించడానికి మనీ కౌంటింగ్ మెషీన్‌లు కూడా అవసరమయ్యాయి. దాడులు భోపాల్‌లోని మెహ్రా ప్రధాన  ఇల్లు ( , లగ్జరీ అపార్ట్‌మెంట్  , గోవింద్‌పుర ఇండస్ట్రియల్ ఏరియాలోని KT ఇండస్ట్రీస్, నర్మదాపురం జిల్లా సైనీ గ్రామంలోని ఫామ్‌హౌస్‌లపై జరిగాయి. మొదటి దశలోనే ఈ ఆస్తులు ఒక 'ట్రెజరీ రిపోర్ట్'లా కనిపించాయి.                        

 మొహ్రా ఫామ్‌హౌస్  లో  32 కాటేజీలు నిర్మాణంలో ఉన్నాయి.  7 పూర్తి చేసిన కాటేజీలు, 6 ట్రాక్టర్లు,  చేపల చెరువు, ఆవుల షెడ్, ఆలయం,   17 టన్నుల  హనీ  స్టోరేజ్ కనిపించింది.  ఫామ్‌హౌస్ ఒక స్వయం సమృద్ధిగా, లగ్జరీ రిట్రీట్‌లా ఉంది.  మొత్తం ఆస్తుల విలువ ఎన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుందో అంచనా వేయడానికి ఇంకా పూర్తి లెక్కలు జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ టీమ్‌లు డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.  

Continues below advertisement

ఆస్తులన్నీ సరే తెనేతో ఏం చేస్తున్నాడన్నది చాలా మందికి అర్థం కాని విషయంగా మారింది. అదే విషయాన్ని మొహ్రా అడిగితే.. తేనే తయారు చేసి అమ్ముతున్నానని అదే తన బిజినెస్ అంటున్నాడు. కానీ అది నమ్మబుద్ది కావడం లేదు. అంతకు మించి ఏదో ఉందని లోకాయుక్త అధికారులు అనుకుంటున్నారు. దాని గురించి బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.