WhatsApp Cyber Crime : సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ హద్దుమీరుతున్నాయి. గతంలో మిలటరీ, పోలీస్ అధికారుల ఫొటోలు పెట్టుకుని ప్రజల్ని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు అధికారుల ఫోటోలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్ నుంచి ఆ సందేశం పంపిన సబైర్ నేరగాడు డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్ షేర్ చేయాలని కోరాడు. పలువురికి మేసేజ్‌లు పంపించారు.
దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరూ డబ్బులు అడిగిన ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ పేరుతో డబ్బులు అుగుతూ వచ్చే మెసెజ్‌లకు దయచేసి జవాబు ఇవ్వకండి. మరియు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ ప్రావీణ్య ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి కలెక్టర్ పేరతో వస్తున్న మెసెజుల్లాంటివి ఇంతకు ముందు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి . తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటోలను వాడుకుని కూడా చేశారు. డీజీపీ, సీఎస్ ఫొటో డిస్‌ప్లే పిక్చర్(డీపీ)గా పెట్టుకుని అధికారులు, సామాన్య ప్రజలకు ఫోన్లు చేశారు. కొందరికి ఫోన్లు, మరికొందరికి మెసేజ్‌లు పంపారు. ఏకంగా సచివాలయ అధికారులు, పోలీసు అధికారులకూ ఫోన్ రావడంతో విషయం సీఎస్, డీజీపీలకూ తెలిసింది. కొద్ది రోజులుగా +977 , +92 కోడ్ తో పాటు ఇతర దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసులు సాంకేతికత ఆధారంగా ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసగాళ్లు రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్‌లు, కూపన్లు, కేవైసీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసిన మోసగాళ్లు… ఇప్పుడు రూటు మార్చారు. తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ .. మెసెజులకు రిప్లయ్ ఇవ్వవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.