Tirupati Crime News : అమెరికాలో ఉద్యోగం అని కేజీ బంగారం ఇచ్చి పెళ్లి చేశారు. అదనంగా లక్షలు నగదు కూడా ఇచ్చారు. ఇంత ఇచ్చారు కదా అని ఇంకా పిండుకుంటే వస్తాయని ఆశపడ్డాడు ఆ డబ్బు జీవి. కొడుకు పుట్టిన తర్వాత కూడా వేధించాడు. చివరికి ఏమీ ఇవ్వకపోవడంతో రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కానీ ఆ భార్య మాత్రం వదిలి పెట్టలేదు. కోర్టుకు లాగేందుకు చేయాల్సినదంతా చేస్తోంది. ఇప్పుడు ఆ పెళ్లికొడుకు అమెరికాలో ఉంటే.. ఇక్కడ ఆయన తల్లిదండ్రులు పరారైపోయారు.
2014లో ఘనంగా పెళ్లి - కుమారుడు పుట్టిన తర్వాత అదనపు కట్న వేధింపులు
తిరుపతిలోని తుమ్మగుంటలో నివాసం ఉండే కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజల కుమారుడు సిద్దేశ్వర్ అమెరికాలో స్ధిర పడ్డాడు. అమెరికాలో ఉద్యోగం రాగానే సిద్దేశ్వర్ ప్రసాద్ కు గూడూరుకు చెందిన ఓలేటి సోనీని 2014లో వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం భార్య సోనీని అమెరికాకు తీసుకెళ్లాడు సిద్దేశ్వర్. 2015లో సోనీ మగా శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత ఇండియాకు వచ్చినప్పుడు సోనీని అమ్మగారి ఇంటికి పంపాడు సిద్దేశ్వర్.. ఇండియాకి వచ్చిన కొన్నాళ్ళు బాగానే మాట్లాడమే కాకుండా, వీడియో కాల్స్ తో కొడుకు, భార్యపై ఆప్యాయత చూపేవాడు. మెల్లగా అదనపు కట్నం ప్రస్తావన తీసుకొచ్చేవాడు.
పెళ్లి సమయంలో కేజీ బంగారం - 12 కేజీల వెండి
అదనపు కట్నం ఒత్తిడి పెరిగిపోవడంతో ళ్లి సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, 12 లక్షల నగదు కట్నం ఇచ్చారని, 50 లక్షలు పెట్టి పెళ్లిని వైభవంగా చేసిన వారిని తిరిగి ఎలా కట్నం అడగమంటావ్ అని సోనీ ఎదురు తిరిగింది. అంతే కొడుకుపై ఆప్యాయత, భార్యపై ప్రేమ చూపడం మానేశఆడు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడటం మానేశాడు. ఫోన్ నెంబర్ కూడా మార్చేశాడు. చివరికి విడాకులు తీసుకోకుండానే మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్లుగా సమాచారం రావడంతో అత్తమామల ఇంటికి వెళ్లింది.
అమెరికా నుంచి వచ్చి ఆగస్టు 21వ తేదీన రెండో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు
పోలీసుల్ని తీసుకుని వెళ్లే సరికి సిద్దేశ్వర్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఆగష్టు 21వ తేదీ భర్త సిద్దేశ్వర్ రెండో పెళ్లి చేసుకునేదుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసిందని తన కు న్యాయం చేయాలని ఎన్ఆర్ఐ భార్య సోనీ పోలీసులని కోరుతోంది. పోలీసులు సిద్ధేశ్వర్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చే్సతున్నారు.