Gujarat Crime:
గుజరాత్‌లో దారుణం..
గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఓ మహిళ కన్న కొడుకునే కసిదీరా చంపేసింది. రెండున్నరేళ్ల బిడ్డని హత్య చేసింది. మళ్లీ ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన బాబు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చింది. దాదాపు మూడు రోజుల పాటు చాలా చోట్ల వెతికారు పోలీసులు. పోలీస్‌లతో పాటు ఆ మహిళ కూడా వెతికింది. కానీ ఎక్కడా ఆ బిడ్డ దొరకలేదు. ఆ తరవాత అనుమానం వచ్చి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ చిన్నారి తల్లిని ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. బిడ్డని తానే చంపినట్టు అంగీకరించింది ఆ తల్లి. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌లోని దిండోలి ప్రాంతంలో కూలీగా పని చేస్తోంది నిందితురాలు నయన మండవి. ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని చేస్తున్నానని, అక్కడే బాబుని వదిలి పనికి వెళ్లినట్టు పోలీసులకు చెప్పింది. ఆ తరవాత ఎంత వెతికినా కనిపించలేదని ఫిర్యాదు చేసింది. అయితే...ఆ సైట్ దగ్గరున్న CCTVని పరిశీలించారు పోలీసులు. ఆ సైట్ వదిలి పిల్లాడు ఎక్కడికీ వెళ్లలేదని కన్‌ఫమ్ చేసుకున్నారు. అప్పుడే డౌట్ వచ్చి తల్లిని గట్టిగా ప్రశ్నించారు. కానీ...సరైన సమాధానాలు చెప్పలేదు. డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దింపినా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఆ తరవాత మరో కథ చెప్పింది ఆ మహిళ. తన ప్రియుడే కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడని బుకాయించింది. ఆ వ్యక్తి కోసం ఆరా తీసినా...ఎక్కడా అతని ఆచూకీ దొరకలేదు.
డ్రామాలు..
ఈ కేసుని సవాలుగా తీసుకున్న పోలీసులు పదేపదే ఆమె తల్లిని ప్రశ్నించారు. అప్పటికి కానీ ఆమె నిజం చెప్పలేదు. తన చేతుల్తో తానే హత్య చేశానని అంగీకరించింది. అయితే..డెడ్‌బాడీ ఎక్కడుందో చెప్పమని అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చింది. ఓ చిన్న గుంతలో పాతి పెట్టానని చెప్పింది. అక్కడ తవ్వితే ఎలాంటి మృతదేహం దొరకలేదు. మరో చోట ఉందని పరుగులు పెట్టించింది. అక్కడా దొరకలేదు. చివరకు తాను పని చేసే సైట్‌లోనే టాయిలెట్‌లో పాతి పెట్టినట్టు అంగీకరించింది. అక్కడే చిన్నారి మృతదేహం దొరికింది. ఎందుకు చంపావ్ అని ప్రశ్నించగా...మొత్తం కథంతా చెప్పింది.
"మాది ఝార్ఖండ్. అక్కడే ఓ వ్యక్తిని ప్రేమించాను. అతనితో కలిసి బతకాలనుకున్నాను. కానీ నా బిడ్డతో వస్తే ఇంటికి రానివ్వని కండీషన్ పెట్టాడు. అందుకే ఏం చేయాలో తెలియక నా బిడ్డను చంపుకున్నాను"
- నిందితురాలు
దృశ్యం సినిమా చూసి..
హత్య చేసిన తరవాత డెడ్‌బాడీని ఎలా దాచాలో అర్థం కాలేదు. దృశ్యం సినిమా చూసి అదే సీన్‌ని రిపీట్ చేసింది. ఆ సినిమాలో ఓ డెడ్‌బాడీని దాచేసి, ఆధారాలేమీ దొరక్కుండా చాలా జాగ్రత్త పడతాడు. పోలీసులను ముప్పతిప్పలు పెడతాడు. చివర్లో డెడ్‌బాడీ ఎక్కడుందో రివీల్ చేస్తారు. రియల్ లైఫ్‌లోనూ ఇది సాధ్యమే అనుకుని ఫిక్స్ అయిపోయిన ఆ మహిళ..అదే ప్లాన్‌ని ఫాలో అయింది. అలా చేస్తే పోలీసులకు దొరికిపోనని అనుకుంది. కానీ..చివరకు కథంతా అడ్డం తిరిగింది.
Also Read: 8 నెలలుగా లోదుస్తులు మాయం, పక్కాప్లాన్‌తో దొంగని పట్టుకున్న మహిళ - చితకబాదిన స్థానికులు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial