సంచRape Case CP CV Anand :  లనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగుర్ని అరెస్ట్ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఇందులో ఒక్కరు మాత్రమే మేజర్ అని.. మిగిలిన వారంతా మైనర్లని ప్రకటించారు. ఏ-1గా సాదుద్దీన్ ఉన్నారని.. మిగతా ఐదుగురి పేర్లు మైనర్లు అయినందున బయట పెట్టడం లేదన్నారు. వీరిలో ఒకరు పద్దెనిమిదేళ్లకు ఒక్క నెల తక్కువగా ఉన్నారు. నిందితులందరిపై 20 ఏళ్లకు తగ్గకుండా శిక్షపడే కేసులు పెట్టామని సీవీ ఆనంద్ తెలిపారు. 


అత్యాచార ఘటన ఎలా జరిగిందంటే ?


మే 28వ తేదీన బెంగళూరుకు చెందిన ఒకబాబు హైదరాబాద్‌ ఇన్‌సోమ్నియా పబ్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి బాధితురాలైన బాలిక కూడా రూ. 1300 ఎంట్రీ ఫీజు కట్టి హాజరయింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలికపబ్‌కు చేరుకుంది. పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో నిందితులు ఇతర అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ కారణంగా బాలిక బయటకు వచ్చింది. అయితే ఆ సమయంలో బాలికను ట్రాప్ చేసిన నిందితులు బేకరికీ తీసుకెళ్లారు. బేకరీకి తీసుకెళ్లే సమయంలో మెర్సిడెస్ బెంజ్ కారులో ఉన్న నలుగురు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. తర్వాత ఆ బాలిక ఇన్నోవా కారులోకి మారింది. అక్కడ్నుంచి జూబ్లిహిల్స్‌లోని పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలోకి కారును తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఐదుగురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.  తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి పబ్ వద్ద వదిలి పెట్టారు. బాలిక ఆ తర్వాత తన తండ్రికి ఫోన్  చేసిందని  సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 


ఒక్కరినే గుర్తు పడుతున్న బాధితురాలు !


ఘటన 28వ తేదీన జరగితే మూడు రోజుల పాటు బాలిక ఎవరికీ విషయం చెప్పలేదని కమిషనర్ తెలిపారు. బాలిక తల్లికి అనుమానం రావడంతో మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్నారు. బాలిక ఇప్పటికీ అందర్నీ గుర్తించలేకపోతోందని.. ఒక్కరిని మాత్రమే గుర్తిస్తోందని.. తెలిపారు. 


పూర్తి సాక్ష్యాలను సేకరించామన్న సీపీ !


జరిగిన గ్యాంగ్ రేప్‌ ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని సీపీ ప్రకటించారు. దర్యాప్తుతో కాస్త జాప్యం జరిగిన మాట నిజమే అయినప్పటికీ  అన్నీ ఆధారాలు పక్కాగా సేకరించామన్నారు. ఆధారాలు లేకుండా ఎవరినీ బుక్ చేయలేమని.. తాము కోర్టుకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నారని సీపీ ఆనంద్ తెలిపారు. అందరిపై గ్యాంగ్ రేప్, పోక్సో కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. 


పబ్ పై కఠిన చర్యలు 


మైనర్లకు పబ్‌లోకి ఎంట్రీ అవకాశం కల్పించిన అమ్నేసియా పబ్‌పై కఠిన చర్యలు ఉంటాయని సీపీ ప్రకటించారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని.. మైనర్లకు అనుమతిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.  ఇన్నోవా డ్రైవర్ వ్యవహారం ఇంకా తేలాల్సి ఉందని.. ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్నందున పలు కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉందని సీపీ తెలిపారు. 


మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్.. తెలంగాణ పోలీసు శాఖకు నోటీసులు ఇచ్చింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. తక్షణ నిందితులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ వీడియోలను పోస్టుల చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ కూడా కోరింది.