జార్ఖండ్ లోని రాంచీకి చెందిన నవీన్ కాష్యప్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తనకంటూ ఓ కుటుంబం ఉంది. కానీ దుర్బుద్ధి ఎక్కడిపోతుంది. విధినిర్వహణలో భాగంగా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ పరిచయం ఇంటికెళ్లేవరకూ వచ్చింది. తన స్నేహితుడంటూ తల్లికి పరిచయం చేసింది ఆ కుమార్తె. కానీ కూతురిని ట్రాప్ చేసిన ఆ కానిస్టేబుల్ ఆమె తల్లిపైనా కన్నేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని కలిసేవాడు. వాడికి బుద్ధి లేకపోయింది మరి ఆ తల్లి బుద్ధి ఏమైందంటారేమో…ఆమె ఉద్దేశం వేరే ఉంది. ఆ ఏరియాలో అక్రమంగా లిక్కర్, సారాయి వ్యాపారం చేస్తుంటుందామె. అందుకే కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం వల్ల తన వ్యాపారం పెరుగుతుందని ఆశపడింది. అనుకున్నట్టుగానే కానిస్టెబుల్ సహకారంతో వ్యాపారం బాగా పెరిగింది. అక్రమ సంబంధం ఎన్నాళ్లని దాగుతుంది. ఏదో ఓ రోజు బయటపడాల్సిందే కదా.
Also Read: కాలేజీలో గ్యాంగ్ వార్, ఈ పిల్ల నాదంటూ గొడవలు..’గల్లీబాయ్స్’ టీజర్ దుమ్ములేపిందన్న అనిల్ రావిపూడి
ఓ రోజు యువతి ఉద్యోగానికి వెళ్లిపోయిన తర్వాత తల్లి కానిస్టేబుల్ కి కాల్ చేసింది. వాడు కార్యాలయానికి అని భార్యకి చెప్పి ఆమె ఇంటికెళ్లాడు. ఇంతలో ఇంటికొచ్చిన కూతురు బెడ్ రూమ్ లో ప్రియుడి పక్కన తల్లిని చూసి రగిలిపోయింది. అక్కడ పెద్ద రచ్చే జరిగింది. తల్లి-ప్రియుడు ఇద్దరూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఆవేశంతో ఊగిపోయింది. వాస్తవానికి కానిస్టెబుల్ కి పెళ్లైన విషయం కూడా ఆమెకి తెలియదు. వాడిని ప్రేమ వివాహం చేసుకోవాలని ఆశపడింది. అందుకే అలాంటి పరిస్థితితో తల్లి-ప్రియుడిని చూసి ఆవేశంతో ఊగిపోయింది. అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్ కి ఏం చేయాలో అర్థంకాక తన వద్దున్న గన్ తో కాల్పులు జరిపాడు. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఉలిక్కిపడిన చుట్టపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని ప్రశ్నించగా.. ప్రమాదవశాత్తు తుపాకి పేలిందని మాటమాటలు చెప్పాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశారు. వెంటనే సస్పెండ్ ఆర్టర్ కూడా జారీ చేశారు. మొత్తం మీద తల్లీ కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యని మోసం చేసిన ఆ కానిస్టేబుల్ నవీన్ ఉద్యోగం ఊడిపోయి జైలుపాలయ్యాడు.
Also Read: గుడ్‌న్యూస్! దిగొచ్చిన పసిడి ధర, స్థిరంగా వెండి.. తాజా రేట్లు ఇవి..
Also Read: ఈ రాశుల ఉద్యోగస్తులకు ఈ రోజంతా శుభసమయమే, ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ALos Read: నేడే ఏపీ ఎడ్‌సెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు.. ఆ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచన..