Constable commits suicide by shooting himself: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సందీప్ అనే కానిస్టేబుల్  ప్రాణాలు తీసుకున్నాడు. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కు చెందిన 30 ఏళ్ల సందీప్  ఆన్ లైన్ బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకోవడం, వ్యక్తిగత సమస్యల కారణంగానే బలవన్మరణం లాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని అనుమానిస్తున్నారు.   సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పోలీసు శాఖలోనూ, స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.                                 

Continues below advertisement

సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ మృతికి గల కారణాలపై విచారణ చేపట్టామని తెలిపారు.  వ్యక్తిగత సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఏవైనా ఇతర కారణాలు ఉంటే తెలుసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఆత్మహత్య పోలీసు శాఖలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలపై కొత్త చర్చకు దారితీసింది. వారం రోజుల కింద కామారెడ్డి జిల్లాలోనూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు.   నవంబర్ 3, 2025 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద జరిగింది. సందీప్ తన సర్వీస్ రివాల్వర్‌ను పట్టుకుని, ఒంటరిగా చెరువు కట్టకు వెళ్లి తన మీదే కాల్చుకున్నాడు. గాయాలతో అక్కడే మరణించాడు. స్థానికులు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.           

సందీప్ (30),  నారాయణఖేడ్ మండలం కల్హేర్ వాసి. 2018లో పోలీసు శాఖలో చేరి, సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య,  ఓ బాబు ఉన్నారు.  పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ టీమ్‌ను పిలిచారు. సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ దర్యాప్తునకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. వ్యక్తిగత కారణాలు  కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కారణమా లేక ఇతర ఒత్తిడులు  ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ మొబైల్, నోట్‌బుక్‌లను స్కాన్ చేస్తున్నారు.  

Continues below advertisement

పోలీసు శాఖలో ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తెలంగాణలో గత ఏడాది 15 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శాఖలో మానసిక ఆరోగ్య సమస్యలపై కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణ పోలీసు శాఖలో వర్క్ లోడ్, షిఫ్ట్ డ్యూటీలు, కుటుంబ బాధ్యతలు వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి.