మహబూబ్ నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్ పై బుధవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. స్థానికంగా ఓ పీఎస్ లో విధులు నిర్వహిస్తోన్న ఓ కానిస్టేబుల్ ఆయనపై హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సీఐ ప్రైవేట్ పార్టు కోసేయడం సహా ఆయన తలపై పదునైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు. అనంతరం సీఐ వచ్చిన కారులోనే పట్టణ సమీపంలోని రోడ్లపై వదిలి వెళ్లాడు. ఉదయాన్నే సీఐను గుర్తించిన స్థానికులు, స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధమే దీనికి కారణమని భావిస్తున్నారు. 


ఇదీ జరిగింది


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సీసీఎస్ లో పని చేస్తున్న సీఐ ఇప్తికార్ అహ్మద్ పై బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్ లో కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి ఆయనపై హత్యా యత్నానికి పాల్పడ్డాడు. సీఐ ప్రైవేట్ పార్టును కత్తితో కోసేయడం సహా తలపై పదునైన ఆయుధాలతో కొట్టాడు. దీంతో సీఐకు తీవ్ర గాయాలు కాగా, ఆయన కారులోనే నగరంలోని పాలకొండ బైపాస్ వద్ద వదిలివెళ్లాడు. తెల్లవారుజామున సీఐను రక్తపు మడుగులో గుర్తించిన స్థానికులు, తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్ఈఎస్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


వివాహేతర సంబంధమే కారణమా?


కాగా, సీఐపై హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ, సీఐను ఇంత దారుణంగా హతమార్చేందుకు కానిస్టేబుల్ యత్నించాడని సమాచారం. నిందితుడి భార్య సైతం మహబూబ్ నగర్ లోని ఓ పీఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.


కేసు నమోదు 


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ హర్షవర్ధన్, అదనపు ఎస్పీ రాములు తదితరులు జిల్లా కేంద్రంలోని ఎస్ఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ అహ్మద్ ను పరామర్శించారు. హత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 


Also Read: సామాన్యుడికి ఎన్నికల కోడ్‌ కష్టాలు- శుభకార్యాలు చేసేవారికి టెన్షన్