Constable Aspirant Death In Visakhapatnam: విశాఖలో (Visakha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న ఓ అభ్యర్థి అస్వస్థతకు గురై పుట్టినరోజు నాడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ కుమార్ అనే అభ్యర్థి కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో (Constable Events) గురువారం పాల్గొన్నాడు. ఫిజికల్ టెస్టులో భాగంగా 1600 మీటర్ల పరుగు పందెం నిర్వహించగా.. అందులో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అభ్యర్థిని ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న అభ్యర్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తాడనుకుంటే పుట్టినరోజే తమకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.


Also Read: Srikakulam News: వాట్సాప్‌లో ఫొటోలు పంపిస్తారు, నచ్చితే హోం డెలివరీ చేస్తారు- శ్రీకాకుళంలో యథేచ్చగా వ్యభిచార దందా