China Battery Explosion: 


నాగ్‌పూర్‌లో ఘటన..


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ 9 ఏళ్ల బాలుడి చేతిలో చైనా బ్యాటరీ పేలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి చికిత్స కొనసాగుతోంది. నాగ్‌పూర్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్న 9 ఏళ్ల బాలుడు చిరాగ్ ప్రవీణ్ పాటిల్ బొమ్మలతో ఆడుకుంటుండగా ఈ పేలుడు సంభవించింది. ఇంట్లోనే ఎలక్ట్రానిక్ ఆటబొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఓ బ్యాటరీకి స్పిన్నింగ్‌ వీల్‌ని అటాచ్ చేశాడు. అది ఫ్యాన్‌లా తిరుగుతుంటే చూసి సంబరపడ్డాడు. గాలి కోసం ముఖం ముందు పెట్టుకున్నాడు. ఆ సమయంలోనే ఉన్నట్టుండి బ్యాటరీ పేలింది. ఫలితంగా...బాలుడి చెవులకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో బ్యాటరీ పేలుడు ఘటనలు పెరుగుతున్నాయి. చాలా మంది చిన్నారులు గాయ పడుతున్నారు. కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీలు పేలడం వల్ల వినికిడి కోల్పోతున్నారు. మరి కొందరికి చూపు పోతోంది. గతంలో ఓ సారి ఇంట్లో స్మార్ట్‌ టీవీ పేలి బాలుడి మృతి చెందిన ఘటన సంచలనమైంది. 


విద్యుత్ వాహనాల బ్యాటరీల పేలుళ్లు..


విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎంత పెరుగుతోందో...అదే స్థాయిలో వాటిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల బైక్‌లు పేలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పేలిన ఘటనలో 5గురు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగిందీ ఘటన. ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టి ఉన్న స్కూటర్‌ ఒక్కసారిగా పేలింది. ప్రమాద సమయంలో ఇంట్లో 5గురు ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదు. కాకపోతే కొన్ని సామాన్లు మాత్రం ధ్వంసమయ్యాయి. మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో వలగెరెహళ్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఆర్నెల్ల క్రితం రూ.85,000 పెట్టి  Route Electric కంపెనీ స్కూటర్‌ కొనుగోలు చేశాడు ముత్తురాజ్. ఉదయ 8 గంటలకు ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టాడు. అలా పెట్టిన కొద్ది నిముషాల్లోనే పెద్ద చప్పుడుతో బ్యాటరీ పేలిపోయింది. స్కూటర్ మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, మొబైల్ ఫోన్‌లు కాలిపోయాయి. 


"ప్రమాదం జరిగినప్పుడు మా కుటుంబం అంతా అక్కడే ఉంది. ఓ పిల్లాడు స్కూటీకి దగ్గర్లోనే ఉన్నాడు. మంటలు ఆర్పలేకపోయాం. రెండు మూడు ఫోన్లు కాలిపోయాయి. ఫ్రిడ్జ్, టీవీ, డైనింగ్ టేబుల్‌, అద్దాలు ధ్వంసమయ్యాయి"  


- బాధితుడు


Also Read: ఆ వృద్ధుడు 36 ఏళ్లుగా ప్రెగ్నెంట్, కడుపులో పెరిగిన కవలలు - వణికిపోయిన వైద్యులు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial