వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ( YS Viveka Murder Case ) ఏ-5 నిందితునిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ( Devireddy Siva Sankar REddy ) బెయిల్ పిటిషన్‌ను కడప కోర్టు మరోసారి తిరస్కరించింది. విచారణ కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ ( CBI ) వాదించింది. అయితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆయనకు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదించారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప జిల్లా కోర్టు ( Kadapa ) బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది.  ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిఉన్నారు. 


అవినాష్‌రెడ్డికి మద్దతు - సునీతపై ఆరోపణలు ! వైఎస్ఆర్‌సీపీ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?


ఎంపీ అవినాష్ రెడ్డికి ( MP Avinash Reddy ) అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు నవంబర్‌లో అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి జైల్లో ఉన్నారు. మధ్యలో కొంత కాలం అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో ఉన్నారు. అప్రూవర్‌గా మారిన  వివేకానందారెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కాకుండా  గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి,  సునీల్‌ యాదవ్‌, ఎర్ర గంగిరెడ్డిలను ఇప్పటి వరకూ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 


అంతా చంద్రబాబు కుట్రే, వివేకా హత్య కేసులో సునీతతో ఆడిస్తున్నారన్న సజ్జల


ఇప్పటి వరకు సీబీఐ అధికారులు అనేక మందిని సాక్షులుగా ప్రశ్నించారు. అనుమానితుల వాంగ్మూలాలు నమోదు చేశారు. దాదాపుగా ప్రతి ఒక్కరి వాంగ్మూలంలోనూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తావన ఉంది. ఈ కారణంగా ఆయన ఈ కేసులోకీలక వ్యక్తిగా భావిస్తున్నారు. ఇప్పటికే  బెయిల్ పిటిషన్ కోసం శివశంకర్ రెడ్డి పలుమార్లు ప్రయత్నించారు. అదే సమయంలో ఈ హత్య కేసులో వైఎస్ సునీతపై ఆరోపణలు చేస్తూ శివశంకర్ రెడ్డి కుమారుడు సీబీఐకి లేఖ రాశారు. ఆయన భార్య అవే ఆరోపణలపై హైకోర్టులో పిటిషన్ వేసింది.


మరో వైపు వైఎస్ వివేకా హత్య కేసులో తుది చార్జిషీట్‌ను సీబీఐ అధికారులు ( CBI officers )  ఈ వారంలోనేదాఖలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి సీబీఐ ఉన్నతాధికారులు రాబోతున్నారని..వారు వచ్చిన వెంటనే..తుది చార్జిషీట్ దాఖలు చేస్తారని భావిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది