Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కపిల్ వాధావన్‌లకు సంబంధించిన అవినీతి కేసులో పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎబిఐఎల్ గ్రూప్ చైర్మన్ అవినాష్ భోసలేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన పలు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా మళ్లించినట్లు సీబీఐ భావిస్తోంది.  


సంజయ్ ఛబ్రియా అరెస్టు


ఈ కేసులో తదుపరి విచారణ కోసం ఏప్రిల్ 30న రాష్ట్రంలోని ప్రముఖ బిల్డర్ల సంస్థల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.  ABIL సంస్థ అధినేత భోసలే ఇళ్లలో సోదాలు చేసింది. అవినీతి ఆరోపణలపై రాణా కపూర్, వాధావన్‌తో పాటు పలువురిపై 2020లో నమోదు చేసిన కేసుకు సంబంధించి భోసలేను అరెస్టు చేసింది. ఈ కేసులో రేడియస్ డెవలపర్స్‌కు చెందిన సంజయ్ ఛబ్రియాను సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది. తమ వద్ద ఉన్న కంపెనీల ద్వారా తనకు, అతని కుటుంబ సభ్యులకు ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఎస్ బ్యాంక్ ద్వారా DHFLకి ఆర్థిక సహాయం అందించడం కోసం కపూర్, వాధావన్‌తో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది.






ఎస్ బ్యాంక్ రూ.3,700 పెట్టుబడి


సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం డీహెచ్ఎఫ్ఎల్ స్వల్పకాలిక డిబెంచర్లలో ఎస్ బ్యాంక్ రూ.3,700 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు, 2018 ఏప్రిల్- జూన్ మధ్య ఈ కుంభకోణం ప్రారంభమైందన్నారు. ప్రతిఫలంగా వాధావన్, కపూర్, వాళ్ల కుటుంబ సభ్యులకు డీవోఐటీ అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రుణం రూపంలో రూ.600 కోట్ల కిక్‌బ్యాక్ చెల్లించారని సీబీఐ గుర్తించింది. అర్బన్ వెంచర్స్ కపూర్ కుమార్తెలు రోషిణి, రాధ, రాఖీకి మోగ్రాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 100% వాటాదారులుగా కలిపించారని ఆరోపణలు ఉన్నాయి. రూ.600 కోట్ల రుణాన్ని DHFL ద్వారా DoIT అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు చాలా తక్కువ విలువ కలిగిన ప్రామాణికం కాని ఆస్తులను కింద తనఖాగా పెట్టారు. 


ఇప్పటి వరకూ రీడీమ్ లేదు


ఎస్ బ్యాంక్ తన డిబెంచర్లలో పెట్టుబడి పెట్టిన రూ.3,700 కోట్ల మొత్తాన్ని DHFL ఇప్పటి వరకు రీడీమ్ చేయలేదని సీబీఐ తేలింది. పైన పేర్కొన్న వాటితో పాటు ప్రాజెక్ట్‌లో ఎటువంటి పెట్టుబడి లేకుండా DHFLకి బదిలీ చేసిన వారి బాండ్స్ పునరుద్ధరణ కోసం ధీరజ్ వాధావన్.. DHFL, RKW డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎస్ బ్యాంక్ రూ.750 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. "రాణా కపూర్ తన భార్య కుమార్తెలు ఉన్న కంపెనీలకు ఎస్ బ్యాంక్ ద్వారా DHFL డిబెంచర్లలో పెట్టుబడి పెట్టే విషయంలో అనవసరమైన డబ్బును పొందారు" అని FIR ఆరోపించింది.