Crime News: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ - తనిఖీ చేస్తుండగా కానిస్టేబుళ్లపై కారు ఎక్కించేశాడు, షాకింగ్ వీడియో

Andhra News: కాకినాడలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లపైకి కారును పోనిచ్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Continues below advertisement

Car Ran Over Two Constables In Kakinada: కాకినాడ జిల్లాలో (Kakinada District) దారుణం జరిగింది. నూతన సంవత్సర వేళ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ ఇద్దరు కానిస్టేబుళ్లపై కారును ఎక్కించారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా.. మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్సై జి.సతీష్, కానిస్టేబుళ్లతో వాహన తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంటన్నర సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న కారు పోలీసులు ఆపగా.. రోడ్డు పక్కకు ఆపుతున్న నటించిన డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చాడు.

Continues below advertisement

కానిస్టేబుళ్లపైకి దూసుకెళ్లాడు..

ఈ క్రమంలో అప్పటికే వాహనం ముందు నిల్చొన్న కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజి లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను కారు ఢీకొని దూసుకుపోయింది. లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారును రాజానగరం సమీపంలోని కెనాల్‌రోడ్డులో డ్రైవర్ వదిలి పరారయ్యాడు. వారిని ప.గో జిల్లా పరిధిలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. యూపీకి చెందిన ఆ కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు

Continues below advertisement
Sponsored Links by Taboola