Cannabis Seized In Hyderabad: హైదరాబాద్ లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 98 కిలోల గంజాయితో పాటు ఏడు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ కి చెందిన  ప్రకాష్ రాథోడ్ (24) గత  కొంతకాలంగా సంగారెడ్డిలో నివసిస్తున్నాడు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చాట్ బండార్ ఎర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాథోడ్ కు పశ్చిమ గోదావరికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ నుండి గంజాయిని తెచ్చి మణికొండలో విక్రయించాలని పథకం రచించారు. ఈ క్రమంలో భాగంగానే ప్రకాష్ రాథోడ్, భాను రాథోడ్ మూడవత్ నివార్తి, భీమ్ రావ్ రాథోడ్, రవీంద్ర చావన్ తో కలిసి 2 వాహనాల్లో ఆంధ్రప్రదేశ్ వెళ్లి.. స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేసిన బొలెరో వాహనం లో 98 కేజీల గంజాయిని తీసుకొని హైదరాబాద్ కు బయలు దేరారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిస్సా బార్డర్ మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న క్రమంలో.. శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, మోయినాబాద్ పోలిసులు పక్కా సమాచారంతో బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. 


నిందితుల వద్ద నుండి సుమారు 32 లక్షల విలువ చేసే  98 కేజీల గంజాయితో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం మాదాపూర్ పీఎస్ పరిధిలో  కూడా లారీ ముందు భాగం ఏరియాను క్యాబినేట్ ల మార్చి 200 కిలోల గాంజాయిని తరలిస్తుండగా పక్క సమాచారం తో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


జూమ్ కార్ ద్వారా కూడా గంజాయి తరలింపు..


ఇటీవలే జూమ్ కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విషయాలను బాలానగర్ డీసీపీ సందీప్ వెల్లడించారు. జగద్గిరిగుట్ట పరిధి మహదేవపురంలో హ్యూందాయ్ వెన్యూ కారులో గంజాయి తరలిస్తునారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసులు కారును తనిఖీలు చేస్తే 104 కేజీల గంజాయి పట్టుబడింది. నలుగురు నిందితులు ఆశిష్ కుమార్(35), కొర్ర రవి(25), కొర్ర శ్రీను(20), నాగేశ్వరరావు(52) లను అరెస్టు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర యావత్ మాల్ ప్రాంతానికి గంజాయి తరలిస్తుంటారని డీసీపీ తెలిపారు. నిందితులు జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని గంజాయి సరఫరా చేస్తుంటారని తెలిపారు. 15 లక్షల విలువైన గంజాయి, కారు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి మొత్తం విలువ రూ.35 లక్షల ఉంటుందన్నారు. నిందితులు సరికొత్త వ్యుహంతో జూమ్ యాప్ ద్వారా కార్లను, బైక్ లను బుక్ చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నారని డీసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించామని తెలిపారు.