Hyderabad Crime News: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని బాధతో హైదరాబాద్‌ శివారులో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తె మరణాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్య పోలీసుల వరకు వీళ్ల పంచాయితీ వెళ్లింది. ఇప్పుడు ఏకంగా కుమార్తె తమ కళ్ల ముందు లేకపోయే సరికి తట్టుకోలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Continues below advertisement

రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చోటుచేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్మాస్‌గూడ ఎస్ఎస్ఆర్ నగర్ కాలనీలో ప్రేమ విఫలమై విహారిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. అంబాదళ  అశోక్,రూపకు ఇద్దరు పిల్లలు. అందులో ఒకరైన విహారిక బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. 

స్థానికంగా ఉండే జై కిషోర్‌ను కొన్ని సంవత్సరాలుగా విహారిక ప్రేమిస్తున్నారు. అతను కూడా ఓకే చెప్పాడు. ఇన్ని రోజులు సాఫీగా సాగిన ప్రేమ కథలో చీలకలు వచ్చాయి. ఈ నెల 17న ఇద్దరూ కనిపించకుండా పోయారు. కంగారుపడిన విహారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Continues below advertisement

ఒకరు రోజు తర్వాత అంటే డిసెంబర్‌ 18న ఇద్దరూ ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. విహారికను తీసుకొచ్చిన కిషోర్ ఇంట్లో అప్పగించాడు. ప్రేమ గురించి తెలిసిన ఆమె తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. వద్దని కిషోర్ అన్నట్టు సమాచారం. తాను మోసపోయినట్టు భావించిన విహారిక బ్రేకప్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

విషయాన్ని తెలుసుకున్న పోలీసులు విహారిక ఇంటికి వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కళ్లముందే ఆడుతూపాడుతూ తిరిన కుమార్తె ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని కన్నవాళ్లు తట్టుకోలేకపోతున్నారు.