YSRCP follower brutal murder in public | వినుకొండ: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో విచక్షణా రహితంగా నరికి హత్య చేయడం కలకలం రేపుతోంది. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నేత రషీద్ పై ప్రత్యర్థి జిలానీ దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహతంగా దాడి చేశాడు. కత్తి దాడిలో చేతులు తెగిపోయి బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా, అవేమీ పట్టించుకోకుండా రషీద్ ను ప్రత్యర్థి జిలానీ హత్య చేశాడు.


రషీద్‌ స్థానికంగా ఓ లిక్కర్ షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఏం జరిగిందో గానీ రషీద్ పై నిందితుడు జిలానీ కత్తితో దాడిచేశాడు. ఓవైపు చట్టుపక్కల ఉన్నవారు వద్దని వారిస్తున్నా, నిందితుడు ఏమాత్రం పట్టించుకోలేదు. జిలానీ కత్తి దాడిలో చేతి తెగిపోయి, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే రషీద్ చనిపోయాడు. ఈ దారుణహత్యతో స్థానికంగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన నిందితుడ్ని వినుకొండ పోలీసులు పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.


టీడీపీ గూండాలు నరరూప రాక్షసులుగా మారారంటూ వైసీపీ నేతలు ఫైర్
పల్నాడు జిల్లా వినుకొండలో పార్టీ కార్యకర్త దారుణహత్యపై వైఎస్సార్‌సీపీ స్పందించింది. టీడీపీ గూండా జిలానీ నరరూప రాక్షసుడిగా మారి, వినుకొండ వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నేత రషీద్‌పై కత్తితో విచక్షణారహితంగా చేశాడని పేర్కొంది. ఈ కత్తి దాడిలో బాధితుడు రషీద్ రెండు చేతులకు,  మెడ, తల భాగాల్లో బలమైన గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రషీద్‌ మృతి చెందాడని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీ హత్యారాజకీయాలకు ఇంకెంత బంది వైసీపీ శ్రేణులు బలికావాలంటూ వైసీపీ ప్రశ్నించింది. దేశంలో ఇంతకంటే దారుణాలు ఎక్కడైనా జరుగుతాయా అని ఏపీ సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో మంత్రి నారా లోకేష్ లను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది ఉన్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


క్వారీ గుంతలో పడి ముగ్గురి మృతి
ఆత్మకూరు(ఎస్‌): ప్రమాదవశాత్తూ క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలం బొప్పారంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రాజు, బిల్డర్‌గా చేస్తున్న శ్రీపాల్‌రెడ్డిలు స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి , రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బొప్పారంలో ఓ ఫంక్షన్ ఉండటంతో మంగళవారం తమ కుటుంబాలతో హైదరాబాద్ నుంచి వెళ్లి హాజరయ్యారు. శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన 12 ఏళ్ల కుమార్తె బుధవారం క్వారీ చూసేందుకు వెళ్లగా, రాజు కూతురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడిపోయింది. బాలికను రక్షించేందుకు దిగిన రాజు, శ్రీపాల్‌రెడ్డి అందులోకి దిగారు. కానీ ఈత రాకపోవడంతో మృతి చెందారు. ముగ్గురు చనిపోవడంపై  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌, కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల హతం