Brave Woman Fights Back Chain Snatchers:   ఆమె అబల కాదు.. ఆపదలో గర్జించే  సబల  అని నిరూపించింది. ఉత్తర ప్రదేశ్‌లోని ఏటా పట్టణంలో ఒక మహిళ ప్రదర్శించిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. నిత్యం ఎక్కడో ఒకచోట దొంగలు మహిళల మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగులు లాక్కెళ్లడం చూస్తుంటాం. కానీ, ఈ మహిళ మాత్రం తనను దోచుకోవాలని చూసిన దుండగులకు చచ్చేంత భయం అంటే ఏంటో రుచి చూపించింది. 

Continues below advertisement

ఏటాలోని ఒక జనసమ్మర్ధం లేని వీధిలో ఆ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఆమె చేతిలోని బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. సాధారణంగా ఎవరైనా ఇటువంటి సమయంలో భయపడతారు లేదా కేకలు వేస్తారు. కానీ, ఆమె మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. సింహంలా వారిపై విరుచుకుపడింది. 

దొంగలు బ్యాగు కోసం లాగడంతో ఆమె రోడ్డుపై కింద పడిపోయింది. అయినా సరే, చేతిలోని బ్యాగును మాత్రం వదలలేదు. కింద పడిన వేగంతోనే తిరిగి లేచి, బైక్ వెనుక కూర్చున్న దొంగ కాలర్ పట్టుకుని కిందకు లాగేసింది. ఆమె ఆకస్మిక దాడికి ఆ దొంగలు బిత్తరపోయారు. ఆమె ప్రదర్శించిన రౌద్రం చూసి, ఇక ఇక్కడ ఉంటే తమ ప్రాణాలకే ముప్పు అని భావించిన దుండగులు బ్యాగును అక్కడే వదిలేసి బైక్‌పై పరారయ్యారు.   

Continues below advertisement

కేవలం 34 సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సిసిటివి  కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇదే  అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భయం ప్రాణాల మీదకు తెస్తుందని, ధైర్యం ప్రాణాలను కాపాడుతుందని ఆమె మరోసారి చాటి చెప్పింది.   

 చాలా సందర్భాల్లో మహిళలు దొంగలను చూసి భయపడి వారు అడిగింది ఇచ్చేస్తుంటారు. కానీ ఈ ఘటన చూశాక, మహిళలు తలచుకుంటే దొంగలను కూడా తరిమికొట్టగలరని అర్థమవుతోంది. స్థానిక పోలీసులు ఈ వీడియో ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఏది ఏమైనా, తన సొత్తును కాపాడుకోవడమే కాకుండా, దొంగల పని పట్టిన ఈ మహిళ ఇప్పుడు అందరి దృష్టిలో ఒక  రియల్ హీరో