Tata Altroz CNG AMT Launched in India Price Features and EMI Details: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనాలకు తెరతీస్తూ టాటా మోటార్స్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మోడల్‌లో ఏఎంటీ (AMT) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఐదు రకాల ట్రిమ్ ఆప్షన్లలో లభించే ఈ కొత్త టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 8.70 లక్షల నుండి రూ. 10.77 లక్షల మధ్య ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ కారు అటు సీఎన్‌జీ ఇచ్చే అద్భుతమైన మైలేజ్, ఇటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించే డ్రైవింగ్ కంఫర్ట్‌ను ఒకే ప్యాకేజీలో అందిస్తోంది. ఈ సరికొత్త టెక్నాలజీతో భారతీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్లో సీఎన్‌జీ ఏఎంటీ కాంబినేషన్‌తో వచ్చిన మొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే టాటా కంపెనీకి చెందిన టియాగో, టైగోర్, పంచ్ మోడళ్లతో పాటు నిస్సాన్ మాగ్నైట్ కార్లు కూడా ఈ తరహా టెక్నాలజీతో మార్కెట్లో రాణిస్తున్నాయి.

Continues below advertisement

Read Also: BYD Sealion Hybrid SUV: బీవైడీ నుంచి సరికొత్త ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ - లాంచ్‌కు ముందే రోడ్లపై ప్రత్యక్షం!

టాప్ వేరియంట్ ధర, ఈఎమ్ఐ లెక్కలు..

Continues below advertisement

కొత్తగా లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ కారును కొనాలని ప్లాన్ చేసే వారి కోసం   పూర్తి ఈఎమ్ఐ (EMI) వివ‌రాలు తెలుసుకుందాం. ఈ నెలవారీ ఈఎమ్ఐ క్యాలిక్యులేషన్ కోసం టాప్-ఎండ్ ట్రిమ్ అయిన 'అకంప్లిష్డ్ ఎస్' (Accomplished S) వేరియంట్‌ను ప్రామాణికంగా తీసుకున్నాము. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 10,76,990 గా నిర్ణయించారు. ఈ లెక్కల కోసం లోన్ అమౌంట్ ఎక్స్-షోరూమ్ ధరలో 100 శాతం ఉన్నట్లుగా భావించాము. బ్యాంక్ వడ్డీ రేటును 9.5 శాతంగా పరిగణనలోకి తీసుకుని, వేర్వేరు రీపేమెంట్ కాలవ్యవధులను బట్టి నెలవారీ ఈఎమ్ఐ ఎలా మారుతుందో ఇక్కడ చూద్దాం. దీనివల్ల కారు బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం కొనుగోలుదారులకు చాలా సులభం అవుతుంది.

Read Also: FASTag Recharge Methods: ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ విధానాలు - హైవే ప్రయాణాన్ని మరింత సులభం చేసే టిప్స్ ..

వేర్వేరు కాలవ్యవధులకు నెలవారీ ఈఎమ్ఐ వివరాలు

ఈ బ్యాంక్ లోన్ లెక్కల ప్రకారం, మీరు కారు కోసం 24 నెలల (రెండు సంవత్సరాలు) రీపేమెంట్ వ్యవధిని ఎంచుకుంటే ప్రతి నెల ఈఎమ్ఐ రూపంలో రూ. 49,449 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం వడ్డీ భారం రూ. 1,09,797 అవుతుంది. అదే మీరు లోన్ వ్యవధిని 36 నెలలకు (మూడు సంవత్సరాలు) పెంచుకుంటే నెలవారీ ఈఎమ్ఐ భారం రూ. 34,499 కి తగ్గుతుంది, ఈ కాలంలో వడ్డీ మొత్తం రూ. 1,64,980 గా మారుతుంది. లోన్ కాలపరిమితిని ఇంకాస్త పెంచుకోవాలనుకునే వారికి మరికొన్ని ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఈఎమ్ఐ కట్టుకోవాలనుకునే మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఈ లాంగ్ టెన్యూర్‌ ఆప్షన్లు బాగా హెల్ప్ అవుతాయి.

లాంగ్ ట‌ర్మ్ లోన్ ఆప్షన్లు..

ఒకవేళ మీరు 48 నెలల (నాలుగు సంవత్సరాలు) రీపేమెంట్ వ్యవధిని సెలెక్ట్ చేసుకుంటే మీ నెలవారీ ఈఎమ్ఐ రూ. 27,057 అవుతుంది, దీనికి మొత్తం వడ్డీ రూ. 2,21,764 చెల్లించాలి. చివరగా అత్యధిక కాలపరిమితి అయిన 60 నెలల (ఐదు సంవత్సరాలు) టెన్యూర్‌ను ఎంచుకుంటే నెలవారీ ఈఎమ్ఐ మరింత తగ్గి రూ. 22,619 కి చేరుకుంటుంది, అయితే ఐదేళ్ల కాలంలో మొత్తం వడ్డీ భారం రూ. 2,80,138 కి పెరుగుతుంది. ఇక్కడ వాహనదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నెలవారీ ఈఎమ్ఐ అనేది మీరు తీసుకునే లోన్ మొత్తం, బ్యాంక్ విధించే వడ్డీ రేటు, మీ సిబిల్ స్కోర్, ఎంచుకునే రీపేమెంట్ కాలవ్యవధి వంటి అనేక రకాల అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది. కాబట్టి కారును బుక్ చేసుకునే ముందు డీలర్‌షిప్ వద్ద సరైన వివరాలు కనుక్కోవడం మంచిది.