BYD Sealion 6 DM i Plug In Hybrid SUV Spied Testing:  ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ (BYD) భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ లైనప్‌ను సైలెంట్‌గా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బ్రాండ్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, సరికొత్త ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ 'బీవైడీ సిలియాన్ 6 డిఎమ్-ఐ' (BYD Sealion 6 DM-i) ని లాంచ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ మోడల్ ఎటువంటి కవర్లు లేకుండా భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయిస్తున్న బీవైడీ పోర్ట్‌ఫోలియోలో చేరబోయే తదుపరి ప్రొడక్ట్ ఇదేనని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. ఈ సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Tata Motors Discounts: టాటా ఈవీ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు - మే నెలలో ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసా.!

డిజైన్ వివరాలు..

కొలతల పరంగా చూస్తే బీవైడీ సిలియాన్ 7 ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీ లాగా ఉంటుంది. ఇది 4,775 mm పొడవు, 1,890 mm వెడల్పు ఇంకా 1,670 mm ఎత్తును కలిగి ఉంటుంది. లీకైన లేటెస్ట్ ఫోటోలలో ఈ కారు వెనుక భాగం చాలా షార్ప్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, మెటాలిక్ యాక్సెంట్స్ ఉన్న రగ్గడ్ బంపర్ వంటి ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న మోడల్ ఆధారంగా చూస్తే, దీని ముందు భాగం స్లీక్ డిజైన్ తో గంభీరంగా ఉంటుంది. ఇందులో స్లాటెడ్ గ్రిల్, డీఆర్ఎల్స్ (DRLs) తో కూడిన షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఇంకా అద్భుతమైన బోనెట్ డిజైన్ ఉన్నాయి. పక్క నుంచి చూస్తే బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, స్ట్రాంగ్ షోల్డర్ లైన్, క్రోమ్ విండో సరౌండ్స్, పెద్ద 19-ఇంచ్ అలాయ్ వీల్స్ ఇంకా స్లోపింగ్ రూఫ్‌లైన్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.

Read Also: Affordable Mileage CNG Cars Under 6 Lakhs:పెట్రోల్‌ ధరల భారం నుంచి విముక్తి! భారత్‌లో అత్యుత్తమ మైలేజ్‌ ఇచ్చే టాప్‌ 5 చౌకైన సీఎన్జీ కార్లు ఇవే!

క్యాబిన్ లగ్జరీ ఫీచర్లు..

సిలియాన్ 6 క్యాబిన్ లోపల కస్టమర్లను ఆకట్టుకునేలా లాంగ్ లిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 15.6-ఇంచ్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 12.3-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా 10-స్పీకర్ల ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇవి కాకుండా హెడ్-అప్ డిస్‌ప్లే, సింథటిక్ లెదర్ అప్‌హోల్స్టరీ, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, హీటెడ్ ఇంకా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్ అసిస్టెంట్, టైప్-ఏ అలాగే టైప్-సి యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఈ ఎస్‌యూవీలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ ఇంకా రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరా, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. హిల్ హోల్డ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హోల్డ్ తో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తాయి.

పవర్‌ట్రెయిన్ ,పర్ఫార్మెన్స్..

గ్లోబల్ మార్కెట్లో ఈ సిలియాన్ 6 మోడల్ రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తోంది. బేస్ వెర్షన్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 98 hp పవర్, 122 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 18.3 kWh బీవైడీ బ్లేడ్ బ్యాటరీని జత చేశారు. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సెటప్‌తో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 197 PS పవర్, 300 Nm టార్క్‌ను అందిస్తుంది. ఓవరాల్ గా ఈ కారు 217 hp కంబైన్డ్ అవుట్‌పుట్‌ను జనరేట్ చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇక టాప్-స్పెక్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 130 hp పవర్, 220 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 hp పవర్ ఇవ్వడం వల్ల మొత్తం సిస్టమ్ అవుట్‌పుట్ 323 hp కి చేరుకుంటుంది. ఈ ఏడబ్ల్యూడీ వెర్షన్ ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో 70 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. భారత మార్కెట్లోకి ఈ టాప్ వెర్షన్నే ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.