Bengaluru mastermind couple arrested in fake Nandini Ghee racket: బెంగళూరులో నడుస్తున్న ఫేక్ నందిని ఘీ ర్యాకెట్‌లో మాస్టర్‌మైండ్ దంపతులైన శివకుమార్, రమ్యలను పోలీసులు అరెస్టు చేశారు. స్వచ్చతకు, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ కేఎమ్‌ఎఫ్ బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందిన 'నందిని' నెయ్యి బ్రాండ్ ను ఉపయోగించుకుని నకిలీ నెయ్యి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. మొత్తం ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కోటిన్నర విలువైన ఆస్తులను సీజ్ చేశారు.
సిసిబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ , కేఎమ్‌ఎఫ్ విజిలెన్స్ వింగ్ బృందాలు నవంబర్ 14న తమకు లభించిన సమాచారం ఆధారంగా రైడ్‌లు నిర్వహించాయి. చామరాజ్‌పేట్‌లోని నంజంబ అగ్రహారాలో కృష్ణా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన యూనిట్‌ను నడుపుతూ, అధునాతన ఇండస్ట్రియల్ యాంత్రిక సాధనాలతో కల్తీ నెయ్యిని తయారు చేసి, నందిని బ్రాండ్ ప్యాకింగ్‌లో మార్కెట్‌లోకి తరలిస్తున్నారు. తమిళనాడు నుంచి కూడా కల్తీ నెయ్యిని సరఫరా చేస్తూ, బెంగళూరులోని హోల్‌సేల్ షాపులు, రిటైల్ ఔట్‌లెట్లు, నందిని పార్లర్లకు పంపుతున్నారు.
ముందుగా నలుగుర్ని అరెస్టు చేసిన సిసిబి బృందం అసలు రాకెట్ సూత్రధారులెవరో కనిపెట్టింది. కేఎమ్‌ఎఫ్ డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర, అతని కుమారుడు దీపక్, తమిళనాడు నుంచి ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న మునిరాజు, అభిరామసు అరెస్టు చేసి తీగ లాగారు..,, ఈ నలుగురూ కల్తీ నెయ్యి తయారీ రోజువారీ ఆపరేషన్లలో ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన వాహనాన్ని కనిపెట్టి చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అసలు విషయాలు బయటకు లాగారు.
పెద్ద ఎత్తున నకిలీ నెయ్యి తయారీకి ఉపయోగించిన మెషినరీ, కొబ్బరి , పామ్ ఆయిల్‌లు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు బోలెరో వాహనాలు సీజ్ చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిపారా అని తెలుసుకోవడానికి సాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. ఈ రాకెట్ పెద్ద ఎత్తున నందిని బ్రాండ్ పేరుతో నకిలీ నెయ్యిని అమ్మిందని గుర్తించారు. నందిని బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మోసంలో పాల్పంచుకున్నారు. ప్రజలు ఫేక్ ప్రొడక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.