Bengaluru Student Rape Case | బెంగళూరు: పాఠాలు చెప్పడంతో పాటు సరైన దారిలో పెట్టి విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దాల్సిన ఇద్దరు అధ్యాపకులు ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. అదనుచూసి ప్లాన్ ప్రకారం కాలేజీ విద్యార్థినిపై ఇద్దరు లెక్చరర్లు అత్యాచారం చేశారు. తన వద్ద వీడియోలు ఉన్నాయని, కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి ఆమెపై మృగంలా ప్రవర్తించి అత్యాచారం చేశారు. బాధను తనలోనే భరిస్తూ, ఎవరికీ చెప్పకుండా ఉన్నప్పటికీ లెక్చరర్లు ఆమెపై వేధింపులకు పాల్పడుతున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..కర్ణాటకలోని దక్షిణ జిల్లా మూడుబిదిరేలోని ఓ ఓ కాలేజీ లో నరేంద్ర పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని (19) పై కన్నేశాడు. సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. నరేంద్ర బుద్ధిని గ్రహించని విద్యార్థిని సారే కదా అని అతడి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేది. అతడు మంచి వాడిలా నటిస్తూ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.
కాలేజీ పనిమీద బెంగళూరుకు..కొన్ని రోజుల కిందట నరేంద్ర, సందీప్ అనే మరో లెక్చరర్ కాలేజీ పనిమీద బెంగుళూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ విద్యార్థినిని సైతం లెక్చరర్లు తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి, అందులోనూ లెక్చరర్ కావడంతో వీరి వెంట వెళ్లేందుకు విద్యార్థిని ఏ అభ్యంతరం చెప్పలేదు. బెంగళూరులో సందీప్ ఫ్రెండ్ అనూప్ రూములో ఈ ముగ్గురు స్టే చేశారు.
ఈ క్రమంలో గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నరేంద్ర ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం గ్రహించిన మరో లెక్చరర్స్ సందీప్ బాధితురాలికి సహాయం చేయాల్సింది పోయి.. అంతా తాను వీడియో తీశానని బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బయట నుంచి తన గదికి తిరిగి వచ్చిన అనూప్ విద్యార్థిని పరిస్థితి గమనించి.. ఇక్కడ ఏం జరిగిందో అంత రికార్డు చేశాను. ఊరికి తీర్చుటకు పోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధను దిగమింగుకొని పాదియుత్రాలు కాలేజీకి వెళ్తోంది. కానీ ఆ లెక్చరర్ల వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు ఇంట్లో విషయం చెప్పింది.
తల్లిదండ్రుల సహాయంతో కర్ణాటక మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు విద్యార్థిని ఫిర్యాదు చేసింది. వారి సూచన మేరకు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. స్నేహితులను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. గతంలో వీరిపై ఇలాంటి కేసులు నవోదయాయని పోలీసులు తెలిపారు.