2025 జూలై 16th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu July 16th 2025
మేష రాశి (Aries)
కెరీర్: ఈ రోజు బాగుంటుంది. పనిచేసే ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు.వ్యాపారం: మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది.ధనం: ఆర్థికంగా రోజు సానుకూలంగా ఉంటుంది. లాభం పొందే అవకాశాలు ఉన్నాయి.విద్య: విద్యార్థులు మనసు పెట్టి చదవండి, విజయం సాధిస్తారుప్రేమ/కుటుంబం: కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 3
వృషభ రాశి (Taurus)
కెరీర్: పనిచేసే ప్రదేశంలో ఉద్యోగులు లాభం పొందుతారు. వ్యాపారం: ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశం ఉంది, ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది.ధనం: కుటుంబ అవసరాలకోసం ఖర్చులు పెరుగుతాయివిద్య: చదువుపై ఆసక్తి పెరుగుతుంది, విజయం లభిస్తుంది.ప్రేమ/కుటుంబం: ఏదైనా శుభవార్త వింటారు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.పరిహారం: లక్ష్మీదేవికి తామర పువ్వు సమర్పించండి.లక్కీ కలర్: ఆకుపచ్చలక్కీ నంబర్: 5
మిథున రాశి (Gemini)
కెరీర్: పనిలో స్థిరత్వం ఉండదు. మధ్యలో డిస్ట్రబెన్స్ ఉంటుంది కానీ సక్సెస్ అవుతారువ్యాపారం: ఈ రోజు నూతన పనలు ప్రారంభించడం అంత మంచిది కాదు..జాగ్రత్తగా ఉండాలిధనం: ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, వృధా ఖర్చులు తగ్గించండివిద్య: చదువుపై మనసు లగ్నం కాదు. ప్రేమ/కుటుంబం: కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు. పరిహారం: దుర్గా సప్తశతి పారాయణం చేయండి.లక్కీ కలర్: బూడిదలక్కీ నంబర్: 4
కర్కాటక రాశి (Cancer)
కెరీర్: మీరు చాలా కష్టపడాలి...అలసట పెరుగుతుందివ్యాపారం: పెద్ద మార్పులు నివారించండి ధనం: ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.విద్య: ఏకాగ్రత లోపం ఉండవచ్చు.ప్రేమ/కుటుంబం: బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తుందిపరిహారం: శివునికి నీరు సమర్పించండి.లక్కీ కలర్: తెలుపులక్కీ నంబర్: 2
సింహ రాశి (Leo)
కెరీర్: నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పురోగతికి అవకాశాలు ఉన్నాయి.వ్యాపారం: కొత్త డీల్ లేదా భాగస్వామ్యం నుంచి లాభం పొందుతారుధనం: పెట్టుబడి నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.విద్య: విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు.ప్రేమ/కుటుంబం: మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశాలున్నాయిపరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.లక్కీ కలర్: బంగారులక్కీ నంబర్: 1
కన్యా రాశి (Virgo)
కెరీర్: ఏదైనా ప్రత్యేక పని కోసం మీరు ప్రయాణించవలసి రావచ్చు.వ్యాపారం: వ్యాపారంలో కొత్త మార్పు ఆలోచన లాభదాయకంగా ఉంటుంది.ధనం: పూర్వీకుల ఆస్తి నుంచి లాభపడతారువిద్య: పాత స్నేహితుడి సహాయంతో చదువులో ప్రయోజనం పొందుతారు ప్రేమ/కుటుంబం: రోజు కుటుంబానికి మంచిది.పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి.లక్కీ కలర్: నీలంలక్కీ నంబర్: 6
తులా రాశి (Libra)
కెరీర్: ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి, పనిలో జాగ్రత్త వహించండి.వ్యాపారం: ఎవరిపైనైనా ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదుధనం: పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి.విద్య: చదువులో హెచ్చు తగ్గులు ఉంటాయిప్రేమ/కుటుంబం: కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది, విభేదాలు ఉండవచ్చు.పరిహారం: దుర్గామాతకు ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించండిలక్కీ కలర్: గులాబీలక్కీ నంబర్: 7
వృశ్చిక రాశి (Scorpio)
కెరీర్: ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. పనిపై ప్రభావం చూపుతుంది.వ్యాపారం: లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించండి. చట్టపరమైన పత్రాలు తనిఖీ చేయడం ముఖ్యం.ధనం: అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.విద్య: అనారోగ్యం కారణంగా చదువు ప్రభావితం కావచ్చు.ప్రేమ/కుటుంబం: కుటుంబ వివాదాలు సాధ్యమే, స్థాన మార్పుకు అవకాశాలు ఏర్పడవచ్చు.పరిహారం: నల్ల నువ్వులను దానం చేయండి.లక్కీ కలర్: ఎరుపులక్కీ నంబర్: 8
ధనుస్సు రాశి (Sagittarius)
కెరీర్: ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందుతుంది.వ్యాపారం: మంచి లాభ అవకాశాలు లభిస్తాయి.ధనం: స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం పరిస్థితిని మెరుగుపరుస్తుంది.విద్య: విద్యార్థులు కష్టపడి పనిచేస్తారు.ప్రేమ/కుటుంబం: పరస్పర విభేదాలు తొలగిపోతాయి. పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.లక్కీ కలర్: పసుపులక్కీ నంబర్: 9
మకర రాశి (Capricorn)
కెరీర్: ఏదైనా శుభవార్త వింటారు. పనిలో పురోగతి ఉంటుంది.వ్యాపారం: ఆస్తి డీలింగ్ నుంచి లాభం ఉంటుంది.ధనం: పెట్టుబడి నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది.విద్య: ఏకాగ్రత కొనసాగుతుంది, ఫలితాలు బాగుంటాయి.ప్రేమ/కుటుంబం: శుభ కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి, కుటుంబంలో ఆనందం ఉంటుంది.పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి.లక్కీ కలర్: గోధుమలక్కీ నంబర్: 10
కుంభ రాశి (Aquarius)
కెరీర్: వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. పనిలో వివాదాలకు అవకాశం ఇవ్వొద్దువ్యాపారం: పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి ధనం: తెలియని వ్యక్తికి అప్పు ఇవ్వడం హానికరం.విద్య: చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండవచ్చు.ప్రేమ/కుటుంబం: పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదాలు జరిగే సూచనలున్నాయిపరిహారం: శివునికి నీలం రంగు పువ్వును సమర్పించండి.లక్కీ కలర్: ఊదాలక్కీ నంబర్: 11
మీన రాశి (Pisces)
కెరీర్: పనిలో విజయం నెమ్మదిగా లభిస్తుంది, ప్రయాణం విజయవంతమవుతుంది.వ్యాపారం: వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉన్నాయి, నిపుణుడి సలహా తీసుకోండి.ధనం: ధన సంబంధిత పనుల్లో విజయం లభిస్తుంది.విద్య: విద్యార్థులకు ఈ రోజు బాగుంది.ప్రేమ/కుటుంబం: విభేదాలు ముగుస్తాయి.పరిహారం: చేపలకు పిండిని తినిపించండి.లక్కీ కలర్: సిల్వర్లక్కీ నంబర్: 12
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.