Andhra Pradesh Crime News: కడప జిల్లాలో వల్లూరు మండలం తప్పెట్లలో రైలు పట్టాలపై మృతదేహాం కలలం రేపింది. పక్కనే యూనిఫామ్ ఉండటంతో ఆయన పోలీసు అయి ఉంటారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ఆత్మహత్య చేసుకుంది ఏఎస్‌ఐని తేలింది. 


 ఆత్మహత్య చేసుకుంది కమలాపురం పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డిగా గుర్తించారు. రాత్రి డ్యూటీ చేశారు. అందరితో సరదాగానే మాట్లాడారు. అయితే ఉదయం డ్యూటీ ముగించుకొని వెళ్లే టైంలో ఏం జరిగిందో ఏమో తెలియదని సహచరులు చెబుతున్నారు. 


రాత్రి డ్యూటీ చేసి ఉదయాన్నే ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు నాగార్జున రెడ్డి. తను వేసుకున్న యూనిఫామ్ తీసి జాగ్రత్తగా పక్కన పెట్టి తర్వాత రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడ పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది.  


ఏఎస్‌ఐ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టాలపై ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఫోన్‌లో సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.