Constable Ramesh Murder Case: విశాఖలో కలకలం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును తవ్వేకొద్ది విస్తుపోయే బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా పథకంతో కానిస్టేబుల్ రమేష్‌ను భార్య శివాని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. రమేష్‌ను అంతమొందించేందుకు శివాని చాలా కాలంగా వ్యూహరచన చేసింది. భర్త తనతో అన్యోన్యంగా ఉన్నట్లు పోలీసుల వద్ద నిరూపించుకునేందుకు ప్లాన్ చేసింది. తనపై అనుమానం రాకుండా చూసుకుందామని శివాని చేసిన ప్రయత్నమే ఆమెపై పోలీసులకు మరింత అనుమానం పెంచేలా చేసింది. 


పథకంలో భాగంగా శివాని కొన్ని రోజుల ముందు నుంచే భర్తతో ప్రేమతో ఉన్నట్లు కొన్ని వీడియోలు తయారు చేసింది. మద్యం మత్తులో పడిపోతున్న భర్తను మంచంపై పడుకోబెట్టింది. పైగా తాను ఓ మంచి భార్యనని వీడియోలో చెప్పించింది. ఇదంతా పథకం ప్రకారం అమలు చేసింది. రమేష్‌ చనిపోయిన తర్వాత పోలీసులు అడగకుండానే వారికి వీడియోలు చూపించి. మేమెంతో అన్యోన్యంగా ఉన్నట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె చూపిన అత్యుత్సాహం పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసిశాయి. రమేష్‌ను చంపాలని నిర్ణయించుకొని ప్రజలను, పోలీసులను నమ్మించేందుకు ఈ తరహా వీడియోలు చేసినట్లు తెలుస్తోంది.


అసలు విషయం ఏంటంటే
2009 బ్యాచ్‌కు చెందిన బర్రి రమేష్‌(35) ఆదర్శనగర్‌లో ఉంటూ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వీరి ఇంటికి ఎదురు ఇంట్లో ఉంటున్న ట్యాక్సీ డ్రైవర్‌ రామారావుతో శివానికి వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు శివాని ప్రియుడు రామారావుతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ఊపిరి ఆడకుండా చేసి గుండెపోటుతో చనిపోయారని నమ్మించేందుకు పథకం వేసింది. తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి హత్య కోసం రామారావుకు రూ.లక్షన్నర డబ్బు ఇచ్చింది. రమేష్‌ను హత్య చేసేందుకు రామారావు తన స్నేహిడుతైన వెల్డర్ నీలా అనే వ్యక్తికి రూ.లక్ష ఇచ్చాడు.


ప్లాన్ ప్రకారం శివాని భర్త రమేష్‌కు ఫుల్లుగా మద్యం తాగించింది. మత్తులోకి వెళ్లగానే ఇంటి బయట వేచి ఉన్న ప్రియుడు రామారావు, హంతకుడు నీలాను పిలిచింది. రమేష్ కదలకుండా శివాని కాళ్లు పట్టుకుంది. నీలా అనే వ్యక్తి దిండుతో రమేష్ మొఖం మీద గట్టిగా నొక్కడంతో ఊపిరాడక చనిపోయాడు. హత్య నుంచి తప్పించుకునేందుకు తన భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ శివాన్ని పోలీసులకు చెప్పుకొచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించగా.. ఊపిరాడక రమేష్ చనిపోయినట్లు తెలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.


శివానిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. శివాని, రామారావు మధ్య ఏడాదిన్నరగా ప్రేమ వ్యవహరం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు వీరి ప్రేమ వ్యవహరంపై గతంలో అనేకసార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. పిల్లల్ని తనకు వదిలేసి ప్రియుడుతో వెళ్లిపోవాలని రమేష్  భార్యకు సూచించాడు. కానీ పిల్లలు, ప్రియుడు ఇద్దరు కావాలని గొడవ పడేది. ఈ నేపథ్యంలోనే రమేష్‌ను చంపేందుకు ప్లాన్ చేసింది. నిందితులు శివాని, ప్రియుడు రామారావు, వెల్డర్‌ నీలాలను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఎంవీపీ స్టేషన్‌ సి.ఐ. మల్లేశ్వరరావు తెలిపారు.