నాలుగు రోజుల్లో వివాహం చేసుకుని అత్తారింటికి ఆనందంగా వెళ్లాలనుకున్న యువతిని మృత్యువు కబలించింది. ఎన్నో ఆకాంక్షలతో నూతన జీవితం మొదలుపెట్టడానికి ఆ యువతి ఎన్నో కలలు కనింది. పెళ్లి తంతులో భాగంగా పెళ్లి కుమారునికి వస్త్రాలు ఇవ్వడానికి తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరింది. అరగంటలో అత్తారింటికి చేరుకుంటుందనే లోగా మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందింది. మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ ఆమెను విగతజీవిగా చేసింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 


Also Read: Guntur Murders: గుంటూరు జిల్లాలో దారుణం.. తల్లీకుమార్తెను కత్తితో పొడిచి చంపిన దుండగుడు


సెప్టెంబర్ 2 వివాహం


అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం సంతేబిదనూరులో నరసింహమూర్తి కుటుంబం నివసిస్తుంది. ఆయన ఏకైక కుమార్తె చైతన్య. పరిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. సెప్టెంబరు 2వ తేదీన పెళ్లి చేయడానికి రెండు కుటుంబాల వారు అన్ని ఏర్పాట్లుచేసుకున్నారు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా అత్తింటి వారికి నూతన దుస్తులు ఇచ్చేందుకు శనివారం సంతేబిదనూరు నుంచి నరసింహమూర్తి, చైతన్య బైక్ పై బయలుదేరారు. 


Also Read: Vishing Fraud: మోసగాళ్ల సరికొత్త టెక్నిక్ ‘విషింగ్’... ఈ విషయాలు తెలుసుకుంటే మీరు చాలా సేఫ్..!


సమయానికి రాని అంబులెన్స్ 


హిందూపురం పట్టణ సమీపంలోని మోతుకపల్లి వద్ద పెన్నా నది వంతెనపై వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తండ్రి నరసింహమూర్తి తలకు, ఇతర చోట్ల గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. చాలా సమయానికి గానీ అంబులెన్స్ రాలేదని బంధువులు ఆవేదన చెందుతున్నారు. చివరికి వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువతి చైతన్య ఆసుపత్రిలో మృతి చెందింది. నరసింహమూర్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను బెంగళూరుకు తరలించారు. హిందూపురం వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ సురేష్‌ను అరెస్టు చేశారు. 


 


Also Read: Vishing Fraud: మోసగాళ్ల సరికొత్త టెక్నిక్ ‘విషింగ్’... ఈ విషయాలు తెలుసుకుంటే మీరు చాలా సేఫ్..!


Also Read: Madhya Pradesh Crime: భార్యపై అనుమానంతో జననాంగానికి కుట్లు.. మధ్యప్రదేశ్‌లో దారుణం