Anantapur News : అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న రేకుల షెడ్డును పోలీసుల సహాయంతో స్థానిక నేతలు కూల్చివేశారని ఓ దళిత కుటుంబం ఆరోపిస్తుంది. షెడ్యూల్ ను కూల్చివేస్తుండగా రెవిన్యూ, పోలీసు అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని బాధితులు అంటున్నారు. షెడ్డును కూలుస్తున్న జేసీబీకి అడ్డువెళ్లిన తమను పోలీసులు ఈడ్చేశారని ఆరోపిస్తున్నారు. తమ ఇల్లు నేలమట్టం కావడంతో సహించలేక భార్యాభర్తలు అనితలక్ష్మీ, హనుమంత రాయుడు పురుగుల మందు తాగి అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశారు. 108లో బాధితుల్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ స్థలాన్ని ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు అనితలక్ష్మీ హనుమంతరాయుడు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించలేదు. అధికారులు చట్టప్రకారమే స్థలాన్ని ఖాళీ చేసేందుకు వచ్చామంటున్నారు.
Anantapur News : ఇళ్లు కూల్చేసిన అధికారులు, బాధతో పురుగుల మందు తాగి భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం
ABP Desam
Updated at:
07 May 2022 07:28 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
Anantapur News : అనంతపురం జిల్లా నిజవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లు ఖాళీ చేసేందుకు వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందే భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం