అమరావతి సచివాలయానికి సమీపంలోని నిర్మాణంలో చోరీ జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న గరుడా హెడ్ క్వార్టర్స్ లో‌ దొంగతనం జరిగింది. అయితే దొంగతనం జరిగిన మాట వాస్తవమే కాని పోలీస్‌ డిపార్ట్మెంట్ కు చెందిన చోట కాదని పోలీసులు ‌చెబుతున్నారు. రాజధాని అమరావతిలో‌ దొంగలు ‌బీభత్సం‌ సృష్టించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న గరుడా పోలీస్‌ కంట్రోల్ రూంలో చోరీ‌ జరిగిందని దళిత‌ సంఘాల‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ‌దొంగ‌తనం జరిగింది వాస్తవమే కానీ విపత్తులు, వాతావరణ శాఖ నిర్మాణ భవనంలో‌ అని పోలీసులు అంటున్నారు. విలువైన ఏసీలు, ఎల్ఈడీ కండక్టర్లు, లైట్లు విలువైన ‌సామాగ్రి పెద్ద మొత్తంలో చోరీకి గురైంది. గతంలో రోడ్లపై ఉన్న మట్టిని సహితం దోచుకువెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను పరీక్షించాలని స్థానికులు కోరుకుంటున్నారు.


డీఎస్పీ ఆఫీసు ఎదుటి దుకాణంలో చోరీ


పోలీసులంటే ఓ భద్రత భరోసా. ఇది పోలీసు డిపార్ట్ మెంట్ స్లోగన్ ( AP Police ) .  కానీ సామాన్యులకు మాత్రం పోలీసులను చూస్తే ఓ రకమైన టెర్రర్. తప్పు చేయని వాళ్లకే ఈ టెర్రర్. నిజానికి దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్లకు ఈ పోలీసులను అసలు పట్టించుకోరు. పోలీసుల ఇళ్లలోనే దొంగతనాలు జరిగిన ఘటనలు చూశాం. ఇప్పుడు అలాంటిదే ఒకటి గుంటూరు జిల్లా గురజాలలో ( Gurajala ) చోటు చేసుకుంది. గురజాలలో డీఎస్పీ ఆఫీసు ( DSP Office ) ఉన్న ప్రాంతం అంటే ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. హెల్మెట్లు లేకుండా లేకపోతే లైసెన్సులు లేకుండా ఎవరూ అటువైపు కూడా పోరు. 


కానీ అలాంటి చోట చేతివాటం అలవాటయిన దొంగలు మాత్రం అలవోకగా లూటీలు చేసేస్తున్నారు. గురజాల డీఎస్పీ ఆఫీసు ఎదురుగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిలో సెల్ ఫోన్ షాపు (Cell Phone Shop ) ఒకటి. ఆ దుకాణం యజమాని యధావిధిగా వ్యాపారం ముగించుకుని ఇంటికెళ్లాడు. మళ్లీ పొద్దున దుకాణం తెరిచి చూస్తే దుకాణం ఖాళీగా ఉంది. పై నుంచి ఎండ లోపలికి వస్తూ కనిపించింది. ఏమిటా అని తలపైకెత్తి చూస్తే అక్కడ పెద్ద బొక్క ఉంది. తన దుకాణంపై కప్పుకు పెద్ద బొక్క పెట్టి అందులోనుంచి దిగి తన సొత్తు అంతా దోచుకెళ్లాడని రెండు నిమిషాలకే ఆ యజమానికి స్ట్రైక్ అయింది. 


అంతే లబోదిబోమంటూ ఎదురుగా ఉన్న డీఎస్పీ ఆఫీసుకు పరుగెత్తుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఎంతయినా అది పోలీసుల ఇజ్జత్‌కు సంబంధించిన విషయం. తమ కార్యాలయం ఎదుటే  దుకాణానికి కన్నం వేసి మరీ దోచుకెళ్లిపోయాడంటే అది వారికి అవమానమే. ఇంకా ఇందులో ట్విస్టేమిటంటే దొంగతనం జరిగిన రోజు పగటి పాటు డీఐజీ త్రివిక్రమ్, ఎస్పీ విశాల్ గున్నీ గురజాల డీఎస్పీ ఆఫీస్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయా.. పోలీసులు భద్రత అందరికీ సక్రమంగా కల్పిస్తున్నారా అనిసమీక్ష చేశారు. సంతృప్తి చెంది వెళ్లారు. కానీ వాళ్ల సమీక్షలో ఏదో మిస్సయిందని చెప్పడానికన్నట్లు దొంగ ఆ రోజు రాత్రే డ్యూటీ ఎక్కాడు.