హైదరాబాద్‌: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో ఐదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్‌ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, ఆపై హత్య చేసి నీటి సంపులో పడేయడం తెలిసిందే.

Continues below advertisement

పాప హత్యపై కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీంచారు. మరోవైపు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సాంకేతిక ఆధారాల సాయంతో హత్య చేసింది సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ అని  పోలీసులు గుర్తించారు. విల్లా ఆర్కిడ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని విక్రమ్‌ కిడ్నాప్ చేసి, క్లబ్‌హౌస్‌ దగ్గర ఉన్న సెల్లార్‌లోకి తీసుకెళ్లాడు. కాళ్లు, చేతులు కట్టేసి, ఓ పెద్ద రాయి బాలికకు కట్టి ఆపై నీటి సంపులో పడేశాడు. చిన్నారి చనిపోయిన తరువాత రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్‌ నుంచి ఒక్కడే బయటకు వచ్చాడు. అనంతరం అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో ఏదో విషయం మాట్లాడి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. 

Continues below advertisement

బిహార్ కు చెందిన విక్రమ్‌ తీరు నచ్చకపోవడంతో కొన్ని రోజుల కిందటే అతడ్ని పనిలోంచి తీసివేశారు. దాంతో కక్ష పెంచుకున్న అతడు టార్గెట్ చేసి బాలికను కిడ్నాప్ చేశాడు. పాప తండ్రికి ఫోన్ చేసి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు సైతం తండ్రి ఒప్పుకున్నట్లు ఆడియో వైరల్ అయింది. అయితే డబ్బులు తీసుకుని పాపను ఇవ్వకపోతే ఎలా అంటూ కొన్ని విషయాలు నిందితుడితో ఫోన్లో మాట్లాడాడు. కానీ ప్లాన్ ప్రకారం చేసిన కిడ్నాప్, కానీ ఇది డబ్బుల కోసం చేసిన పని కాకపోవడంతో చిన్నారి హత్య చేసినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం మల్కాజిగిరి సీపీ సుమతి ప్రెస్‌మీట్‌ పెట్టి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. 

పగబట్టి ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన మాజీ వాచ్‌మన్భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మిల్టన్ ఫెర్నాండెజ్, డేజి ఇవాంజెలియా దంపతులు 2019 నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కౌకూరు విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. వీరికి బాబు జేడెన్ ఫెర్నాండెజ్, కూతురు మోజెస్ అరేలియా (5) ఉన్నారు. ఈ విల్లాలకి విక్రమ్ అనే యువకుడు గతంలో వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇటీవల విల్లా నిర్వాహకులు సెక్యూరిటీ గార్డును జాబ్ నుంచి తొలగించారు. 

విల్లా అసోసియేషన్ సభ్యులతో పాటు హత్యకు గురైన బాలిక కుటుంబంతోనూ విక్రమ్‌కు తీవ్ర గొడవ జరిగింది. దాంతో కక్ష పెంచుకున్న సెక్యూరిటీ గార్డు శనివారం సాయంత్రం విల్లాల వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా, అరేలియా ఫ్యామిలీ అక్కడికి వెళ్లింది. బాలిక ఇంటి సమీపంలోని క్లబ్‌హౌస్ దగ్గర సైకిల్ తొక్కుతుండగా సాయంత్రం 6:30 సమయంలో విక్రమ్ విల్లాల వద్దకు రాగా, సెక్యూరిటీ సిబ్బంది అతడిని లోపలికి అనుమతించారు. క్లబ్‌హౌస్ వద్ద ఉన్న చిన్నారిని విక్రమ్ సెల్లార్‌లోకి తీసుకెళ్లి, కాళ్లు చేతులు కట్టేసి పెద్ద రాయిని పాప శరీరానికి కట్టి నీటి సంపులో పడేసి హత్య చేశాడు. తరువాత సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి తనకు ఏమీ తెలియనట్లు నిందితుడు విక్రమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.