చంపాపేటలోని ఎస్జీఆర్ కాలనీలో దారుణం జరిగింది. యువతి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అపై రెండో అంతస్తుపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 


చంపాపేటలోని ఎస్జీఆర్ కాలనీలో దారుణం జరిగింది. యువతి గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. అపై రెండో అంతస్తుపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనతో చంపాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహబూబ్ నగర్ హన్వాడ తండాకి చెందిన స్వప్న(21), హనుమంతు ఒకే ఇంట్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అద్దెకు గది తీసుకోవడానికి ముందు అన్నా చెల్లెలు అని చెప్పి ఇద్దరు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా స్వప్న ఒంటరిగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి హనుమంతు వెళ్లేవాడు. రెండో అంతస్తు నుంచి హనుమంతు కిందకు దూకడంతో ఇంటీ యజమాని గమనించాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మెట్లు దిగుతుండగా ఇంటి ఓనర్ చూశాడు. దీంతో అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. నెల రోజుల కిందట వీరికి వివాహం అయిందని పోలీసులు భావిస్తున్నారు.


యువతి హత్య, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిసరాలను క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధారాల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానస్పందగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు స్థానికులకు సూచించారు. 


సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేయడమే కాకుండా బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఇద్దరు ఎవరు ప్రేమికులా? లేక స్నేహితులా? అసలేం జరిగింది? యువతిని హత్య చేసి తాను ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.


ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య హనుమంతు కొట్టుమిట్లాడుతున్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


నిందితుల కోసం పోలీసులు గాలింపు 


ఘటన జరిగిన తర్వాత గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మెట్లు దిగుతుండగా ఇంటి ఓనర్ చూశాడు. వారిద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. వారిద్దరు ఎవరు? ఇక్కడ నుంచి వచ్చారు? ఈ ఘటనకు వారికి ఏం సంబంధం? వీరికి ఆ ఇద్దరు ఏమవుతారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఎందుకు సంబంధించిన విషయాలు త్వరలో వెల్లడిస్తామని ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.