People Burnt Alive In Car Accident In Medchal: మేడ్చల్ జిల్లాలో (Medchal District) ఘోర ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘనపూర్ సర్వీస్ రోడ్డులో ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. వేగంగా వెళ్తున్న కారులో మంటలు ఏర్పడి.. అంతలోనే భారీగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ఫుట్‌పాత్‌పై పడి చనిపోయాడు. ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తి కారులోనే మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు మేడిపల్లిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కోసం అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్‌కేసర్ సీఐ పరశురామ్ చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.


Also Read: Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు - ఈసారి ఎందుకంటే?