Telangana Crime News: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. పాడుపని చేయాలని బలవంతం చేశాడు. ఒప్పుకోని ఆ చిన్నారి పదిమందికి చెప్పి పరువు తీస్తుందని హతమార్చాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన పరిస్థితులు ఎంతలా దిగజారాయో చెబుతోంది. 


మహబూబ్‌నగర్‌ జిల్లా మరిపెడ మండలానికి బానోతు నరేష్‌ ఫ్యామిలీ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చింది. మియాపూర్‌లోని నడిగడ్డ తండాలో భార్య, 13 ఏళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్నాడు నరేష్. ఫుడ్‌డెలవరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తరచూ ఫోన్‌లో పోర్న్‌ వీడియోలు చూసే నరేష్‌కు 13 ఏళ్ల కుమార్తెపై పాడుబుద్ది పుట్టింది.


కొన్ని రోజులు నుంచి ఫోన్ డిస్‌ప్లే పని చేయడం లేదు. దీంతో అతనిలై లైంగిక కోరికలు ఎక్కువ అయ్యాయి. అందులోనూ మందుకు బాగా అలవాటు పడి ఉండటంతో అతని మైండ్‌ పూర్తిగా పిచ్చి ఆలోచనతో నిండిపోయింది. ఎప్పటి నుంచో కుమార్తెను వక్రబుద్దితో చూసే నరేష్‌... ఈనెల 7న ఉదయం కట్టెల కోసం తీసుకెళ్లి బలత్కరించబోయాడు. తండ్రి చేసిన పాడుపనికి చిన్నారి ఆశ్చర్యపోయింది. తేరుకొని కేకలు వేసింది. అక్కడి బయటపడేందుకు పారిపోయింది. తన విస్వరూపం కుమార్తెకు తెలిసిపోయిందని... భార్యతోపాటు బంధువులందరికీ చెప్పేస్తుందని గ్రహించిన నరేష్‌ ఆమెను హతమార్చాడు. 


పారిపోతున్న కుమార్తెను గట్టిగా పట్టుకున్నాడు. ముఖంపై కొట్టాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు మూర్చపోయిన చిన్నారిపై బండరాయితో బాది ప్రాణాలు తీశాడు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశాడు. 


సాయంత్రానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి స్కూల్ వెళ్లాలని బలవంతం చేయడంతో తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ దిశగానే కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు సాగుతుండగానే రోజూ వెళ్లి డెడ్‌బాడీని చూసి వచ్చేవాడు. ఇటు పోలీసు స్టేషన్‌కు వచ్చి తన కుమార్తె ఎక్కడుంది ఏం చేస్తున్నారు వెతకడం లేదంటూ పోలీసులపై ఫైర్ అయ్యేవాడు. 






ఇంతలో మియాపూర్ పరిధిలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి డెడ్‌బాడీ ఒకటి ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. వెళ్లి చూస్తే అది నరేష్ కుమార్తెదే. కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలో సీసీ టీవీఫుటేజ్ చెక్ చేస్తే నరేష్ అసలు స్వరూపం బయటపడింది. ఆ రోజు నరేష్ తన కుమార్తెతో బైక్‌పై వెళ్లి తర్వాత ఒక్కడే రావడాన్ని పోలీసులు గుర్తించారు. 
నరేష్‌పై అనుమానంతో పోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. అంతే ఠక్కున నిజం వచ్చేసింది. తన కుమార్తెను తానే హత్య చేసినట్టు నరేష్ ఒప్పుకున్నాడు. ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.