Brush Penetrated The Boy Jaw While Brushing In Satyasai District: 'టైం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది.' ఇది ఓ సినిమాలోని డైలాగ్. ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఓ బాలుడి విషయంలోనూ అదే జరిగింది. బ్రష్ చేస్తుండగా కింద పడడంతో అతని దవడలోకి అది చొచ్చుకుపోయింది. చివరకు ఆపరేషన్ చేసిన వైద్యులు దాన్ని తొలగించారు. సత్యసాయి జిల్లాలో (Satyasai District) ఈ ఘటన జరిగింది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో ఓ బాలుడు (11) ఉదయం బ్రష్ చేస్తుండగా అనుకోకుండా ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ క్రమంలో బ్రష్ అతని దవడలోకి చొచ్చుకుపోయింది.


దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు నొప్పితో విలవిల్లాడాడు. గమనించిన బాలుడి తల్లిదండ్రులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు బాలునికి ఆపరేషన్ చేసి బ్రష్ తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రతిరోజూ బ్రషింగ్ రెండు నిమిషాల పాటు శ్రద్ధగా చేస్తే సరిపోతుందని.. బ్రష్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read: Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?