Baby Boy Thrown Into The Canal In Karimnagar: 3 రోజుల మగశిశువును మూటలో కట్టి కెనాల్లో విసిరేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో (Karimnagar District) చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూరాబాద్ (Huzurabad) మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ పసికందును విసిరేశారు. అటువైపుగా వెళ్తున్న ఓ రైతు పసికందు ఏడుపు విని దగ్గరకు వెళ్లి చూడగా.. ఓ మూటలో శిశువును గమనించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిశువు జన్మించి 3 రోజులు అవుతుందని.. బిడ్డ శరీరంపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. బిడ్డను ఎవరు ఇక్కడ విసిరేశారనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్ జీ తెలిపారు.
Also Read: Crime News: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ - రోడ్డెక్కిన 500 మందికి పైగా విద్యార్థినులు