62 year old man travels to Assam to marry Facebook lover: ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. పెళ్లిచేసుకుందాం రమ్మంది. అందే తన వయసును కూడా చూసుకోకుండా.. ఓ 62 ఏళ్ల వ్యక్తి  ..వారణాశి నుంచి అస్సాం వెళ్లిపోయాడు. కానీ అక్కడికి వెళ్లే సరికి స్థానికులు తన్ని తరిమేశారు. బతుకుజీవుడా అంటూ తిరిగి వారణాళికి వచ్చాడు.  కొంత మంది ఆయన వయసు 71 ఏళ్లకుపైనే ఉంటుందని చెబుతున్నారు.    

ఈ 62 ఏళ్ల వ్యక్తి ,  26 ఏళ్ల మహిళ మూడు సంవత్సరాల నుంచి ఫేస్‌బుక్ ద్వారా స్నేహం చేశారు. ఈ క్రమంలో ఆ మహిళ ఆ వ్యక్తి పెళ్లి ప్రతిపాదనను అంగీకరించింది. అస్సాం వచ్చి పెళ్లి చేసుకోవాలని కోరింది. అమ్మాయే రమ్మంది కదా అని  అతను అస్సాంలోని  సివసాగర్‌లోని ఆమె అద్దె ఇంటికి చేరుకున్నప్పుడు, ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అతను వస్తాడని అనుకోలేదో..అంత పెద్ద వ్యక్తితో పెళ్లి ఏమిటని అనుకుందో కానీ పెళ్లి వద్దని తేల్చేసింది. అది చిన్నగా గొడవగా మారడంతో  స్థానికులు వారు ఆగ్రహంతో ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. చితక్కొట్టారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ వ్యక్తిని రక్షించి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.  36 సంవత్సరాల వయసు తేడాతో ఉన్న ఈ జంట మధ్య సంబంధం గురించి తెలిసిన స్థానికులు, ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది, చివరకు పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ వ్యక్తి మహిళ నిరాకరణ తర్వాత అస్సాంను విడిచి వెళ్లిపోయాడు.                     

ఈ ఘటన సామాజిక మీడియా ద్వారా ఏర్పడే సంబంధాలపై మరోసారి చర్చను రేకెత్తించింది. ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా స్నేహం చేసుకుని, వ్యక్తిగత సంబంధాలను  పెంచుకుంటే ఇలాగే జరుగుతుందని అంటున్నారు.  పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో అతని ప్రాణం నిలబడింది.